రాహుల్ సన్నిహితుడు.. మోడీ నిర్ణయానికి సపోర్ట్!

కశ్మీర్ పై మోడీ ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతూ ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ బాహటంగానే వ్యతిరేకించింది. లోక్ సభలో, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ…

కశ్మీర్ పై మోడీ ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతూ ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ బాహటంగానే వ్యతిరేకించింది. లోక్ సభలో, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే అధికరణలను రద్దుచేయడం సమంజసం కాదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.

అయితే ఆ పార్టీలోనే  ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది కాంగ్రెస్  నేతలు లోక్ సభలో, రాజ్యసభలో ఈ అంశం గురించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆఖరికి కశ్మీర్ వ్యవహారం కేవలం భారత అంతర్గత వ్యవహారం కాదనేంత స్థాయిలో వ్యాఖ్యానించారు. వారు అలా కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశారు.

ఇక మరి కొందరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటూ ఆ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ జాబితాలో చేరారు  జ్యోతిరాదిత్య సింధియా. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన సింధియా.. కశ్మీర్ ను భారత్ లోకి విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

ఆ మేరకు ట్వీట్ చేశారు. ఒకదశలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి కూడా సింధియా పేరు వినిపించింది. అలాంటి నేత ఇప్పుడు బీజేపీ నిర్ణయానికి పూర్తి మద్దతు పలికారు. దేశం కోసం.. అంటూ కమలం పార్టీ విధానాన్ని సపోర్ట్ చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచినే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?