మెగాస్టార్ జడ్జ్ అయి వుంటే…

మెగాస్టార్ చిరంజీవి జడ్జ్ అయివుంటే కోర్టులో కాకుండా ఆయన స్వంత ఇంట్లోనో, ప్రైవేటు ప్లేస్ లోనో కార్యక్రమాలు నిర్వహించి వుండేవారని, ఆయన జడ్జ్ కాకపోవడం అదృష్టం అనే గట్టి కామెంట్ చేసారు నిర్మాతల కౌన్సిల్…

మెగాస్టార్ చిరంజీవి జడ్జ్ అయివుంటే కోర్టులో కాకుండా ఆయన స్వంత ఇంట్లోనో, ప్రైవేటు ప్లేస్ లోనో కార్యక్రమాలు నిర్వహించి వుండేవారని, ఆయన జడ్జ్ కాకపోవడం అదృష్టం అనే గట్టి కామెంట్ చేసారు నిర్మాతల కౌన్సిల్ నాయకుడు ప్రసన్నకుమార్. మెగాస్టార్ ఇంట్లో ఇండస్ట్రీ సమావేశాలు పెట్టడం పై ఆయన ఆది నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

నిర్మాతల మండలి, చాంబర్ ఇలా అనేక వ్యవస్థలు వుండగా, కొద్ది మందితో మెగాస్టార్ ఇంట్లో ఎలా సమావేశం పెడతారన్నది ఆయన పాయింట్. ఇండస్ట్రీలో వున్నంతకాలం యాక్టివ్, ఇన్ యాక్టివ్ అన్న ప్రశ్నే తప్పు అని ఆయన అంటున్నారు. సినిమాలు వదిలేసి రాజకీయాలు చేసుకున్నపుడు మెగాస్టార్ ఇన్ యాక్టివ్ అని ఎవరన్నా అన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

గిల్డ్ లో వున్న దామోదర్ ప్రసాద్ సినిమా తీసి ఎన్నాళ్లయిందని ప్రసన్నకుమార్ నిలదీసారు. సురేష్ బాబు బ్యానర్ ఇవ్వడం కాకుండా సినిమాలు స్వంతంగా తీసి ఎన్నాళ్లు అయిందని ఆయన ప్రశ్నించారు. చాంబర్ లేదా కౌన్సిల్ అయితే అందరికీ ఆహ్వానం వుంటుంది. అందరూ వస్తారని, అదే చిరంజీవి ఇల్లు అంటే ఎందుకు వస్తారని? ఎవరి అంతటి వారు వారని ఆయన అన్నారు. 

మొత్తానికి మెగాస్టార్ ఇంట్లో మీటింగ్ వ్యవహారం కాస్త చినికి చినికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. ఇదంతా సిఎమ్ జగన్ దృష్టికి వెళ్తే ఎలా వుంటుందో? ఏం జరుగుతుందో?