జీతం ఇవ్వని మీడియా కోసం జీవితం ఇచ్చేశావా!

సమాజానికి-ప్రభుత్వానికి వారథి.. వాస్తవాల్ని కళ్లకు కట్టే ధైర్యశాలి.. అలుపెరగని సైనికుడు.. ఇలాంటి పేర్లు, పొగడ్తలు ఎన్ని పెట్టుకున్నప్పటికీ వాస్తవంలోకి తొంగిచూస్తే.. జర్నలిస్ట్ జీవితం దుర్భరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించి తీరాల్సిందే. దీనికి…

సమాజానికి-ప్రభుత్వానికి వారథి.. వాస్తవాల్ని కళ్లకు కట్టే ధైర్యశాలి.. అలుపెరగని సైనికుడు.. ఇలాంటి పేర్లు, పొగడ్తలు ఎన్ని పెట్టుకున్నప్పటికీ వాస్తవంలోకి తొంగిచూస్తే.. జర్నలిస్ట్ జీవితం దుర్భరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించి తీరాల్సిందే. దీనికి అద్దం పడుతోంది కరోనాతో మృతిచెందిన జర్నలిస్ట్ మృతి.

ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ బతుకు చిత్రంపై సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఓ సందేశం. ఛానెల్ కు న్యూస్ అందించడం కోసం ఓ జర్నలిస్ట్ తన జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా ఫణంగా పెడుతున్నాడనే విషయాన్ని ఈ సోషల్ మీడియా పోస్టులో కళ్లకు కట్టారు. మీడియా అరాచకాల్ని బయటపెడుతూ, జర్నలిస్టుల దుర్భర జీవితాన్ని ఆవిష్కరిస్తూ.. ప్రతి ఒక్కర్ని కదిలిస్తోన్న ఆ పోస్టును ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాం.

ఏందిరా భాయ్ ఈ దారుణం…. జీతం సరిగా ఇవ్వని మీడియా కోసం జీవితం ఇచ్చేశావా….

– న్యూస్ కవరేజ్ కోసం వెళితే దారిలో ప్రమాదం జరిగినా పనిచేసే సంస్ధలు పైసా ఇవ్వరని తెలుసు…
– పైగా జాగ్రత్తగా ఉండక్కర్లేదా అని జాలి చూపించి ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొనే మేనేజ్మెంట్లు ఉన్నాయని తెలుసు..
– రేపు లీవ్ తీసుకుని ఎల్లుండి వచ్చేయ్ అనే హృదయంలేని ఇన్చార్జులు ఉన్నారని తెలుసు..
– అన్నం తినే సమయంలో పక్క ఛానల్ లో బ్రేకింగ్ పడుతుంటే చేతులు కడుక్కొని పరిగెత్తాలని తెలుసు…
– అర్దరాత్రి గాఢ నిద్రలో ఫోన్ రింగ్ అయితే పరిగెత్తాలని తెలుసు….
– 24 గం.లు ఫోన్ & వాట్సప్ ఆన్ లో ఉండాలని తెలుసు..
– మిగిలిన బీట్లు లాగ కాకుండా 24 గం.లు డ్యూటి చేయాలని తెలుసు..
– రెగ్యులర్ గా మార్చురి దగ్గర వాసన పీల్చాలని తెలుసు…
– శవాలతో సావాసం, పోలీసులతో పరుగులు ఉంటాయని తెలుసు..
– సమాచారం వస్తే 5 నుండి 10 నిమిషాల్లో స్పాట్ లో ఉండాలని తెలుసు…
– కుటుంబంతో ఒక పూట కూడా గడిపే అవకాశం ఉండదని తెలుసు..
– మూడు పూటల టైమ్ ప్రకారం తినడం అంటే అద్బుతం అని తెలుసు…
– టైమ్ కి తినక ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు…
– ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే పై నుండి పడే అక్షింతలు తెలుసు…
– హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదని తెలుసు..
– ఎవడూ సాయం చేయడని తెలుసు..
– జీతం టైయానికి ఇవ్వరని తెలుసు..
–  జీవితానికి గ్యారంటి లేదని కూడా తెలుసు..

రెగ్యులర్ #క్రైమ్_రిపోర్టింగ్ చాలదన్నట్టు..

– కరోనా కవరేజ్ ఇవ్వాలని తెలుసు..
– కరోనా వైరల్ వైరస్ అని తెలుసు..
– జాగ్రత్తలు తీసుకొనే డాక్టర్లే బలైపోతున్నారని తెలుసు..
– మిగిలిన స్టాఫ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా నువ్వు మాత్రం ఫీల్డ్ లో ఉండాలని తెలుసు..
– కోవిడ్ హాస్పటల్స్ దగ్గరకి, కంటోన్మెంట్ ఏరియాల దగ్గరకి వెళ్లాలని తెలుసు…
– కరోనా సోకే ప్రమాదం ఉందని తెలుసు…

ఇన్ని తెలిసి కూడా ధైర్యంగా పనిచేస్తున్నాడంటే అది క్రైమ్_రిపోర్టర్ అంటే…..

ఎన్నో వార్తలు అందించిన రిపోర్టర్లు వార్తగా మారడం నిజంగా దురదృష్టకరం… ప్రతి క్రైమ్ రిపోర్టర్  తీవ్రఅనారోగ్యంతో గాని ప్రమాదాల్లో మరణించక తప్పదు…

నన్ను కలచివేసింది మిత్రమా…. 

ఈ మరణంతో అయినా మీడియా యాజమాన్యాలు & జర్నలిస్టు సంఘాలు కళ్లు తెరిచి హెల్త్ ,లైఫ్ ఇన్స్యూరెన్స్ పై దృష్టిపెట్టాలి……