లోకేష్ కలుగులోంచి బైటకొచ్చింది అందుకేనా..?

నారా లోకేష్, కుటుంబం కంటే ఎక్కువగా ట్విట్టర్ తోనే కాలం గడుపుతుంటారు. ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలన్నా, ఇంకెవరినైనా విమర్శించాలన్నా ఆయనకు ట్విట్టర్ ఉండాల్సిందే. నేరుగా మాట్లాడ్డానికి భయపడతాడనే ఉద్దేశంతో చంద్రబాబు కూడా ఆయన్ని సోషల్…

నారా లోకేష్, కుటుంబం కంటే ఎక్కువగా ట్విట్టర్ తోనే కాలం గడుపుతుంటారు. ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలన్నా, ఇంకెవరినైనా విమర్శించాలన్నా ఆయనకు ట్విట్టర్ ఉండాల్సిందే. నేరుగా మాట్లాడ్డానికి భయపడతాడనే ఉద్దేశంతో చంద్రబాబు కూడా ఆయన్ని సోషల్ మీడియాకే పరిమితం చేశారు. అలాంటి చినబాబు సడెన్ గా తెరపైకొచ్చారు. అటు ఇటు సీనియర్ నేతల్ని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీపై దుమ్మెత్తిపోశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సడెన్ ఎంట్రీ వెనక అసలు రీజన్ ఎంటో ఎవరికీ అర్థం కాలేదు.

టీడీపీ వర్గాల్లో మాత్రం లోకేష్ ఎంట్రీకి అసలు కారణం రామ్మోహన్ నాయుడు అని గట్టిగా వినిపిస్తోంది. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరుతో ఫేక్(అని చెప్పుకుంటున్నారు) అకౌంట్ల నుంచి మాంఛి మసాలా ట్వీట్లు పడుతున్నాయి. బరువు మాత్రమే ఉన్న(లోకేష్) వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా.. బరువు మోసే(రామ్మోహన్ నాయుడు) వ్యక్తికి పార్టీని అప్పగిస్తారా తేల్చుకోండి అంటూ ట్వీట్లు పడుతున్నాయి.

రామ్మోహన్ నాయుడుకి టీడీపీ పగ్గాలు అప్పగించడమంటే అది అత్యాశే అవుతుంది కానీ.. ఎందుకో ఉత్తరాంధ్ర కేంద్రంగా ఈ డిమాండ్ మాత్రం బాగా వినిపిస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కొడుకుల చేతిలోకే పగ్గాలు వెళ్లకుండా అడ్డుకున్న చంద్రబాబు, తమ కుటుంబాలను దాటి వేరేవారికి పార్టీని అప్పజెబుతారా? ఈమాత్రం లాజిక్ లేక కాదు కానీ.. ఎందుకో సడన్ గా రామ్మోహన్ నాయుడుని సోషల్ మీడియాలో హీరోను చేసేశారు. అంతలోనే ఆయన సర్దుకోవడం, తనపేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు సృష్టించి తనకు అప్రతిష్ట తెస్తున్నారని చెప్పుకోవడం అన్నీ చూశాం.

మొత్తమ్మీద ఈ విషయంతో రామ్మోహన్ నాయుడు, ఇంకొంతమంది ఉత్సాహవంతులకి టీడీపీ పీఠంపై ఆశ పుట్టిందనేమాట వాస్తవం. లోకేష్ సరైనోడు కాదు అనే విషయం జగమెరిగిన సత్యం, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో జనంలో ఆయన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. అందుకే చంద్రబాబు కూడా కొడుకుని మెయిన్ స్ట్రీమ్ లోకి తేకుండా తానే అన్నీ ముందుండి నడిపిస్తున్నారు. దీంతో టీడీపీలోని ఆశావహులు బాబు తర్వాత తమకేమైనా అవకాశముంటుందేమోనని ముందే చెక్ చేసుకుంటున్నారు.

తెరవెనక ఇలాంటి కార్యకలాపాలు చాలానే జరుగుతున్నాయని బాబు పసిగట్టారు. అందుకే అర్జంట్ గా ప్రెస్ మీట్ పెట్టాలని, వైసీపీపై రెచ్చిపోవాలని కొడుకుని ఆదేశించారు. ఒక్కడే వెళ్తే తడబడతాడని, నలుగురు సీనియర్లను వెంటబెట్టారు. అస్మదీయులైన జర్నలిస్ట్ లకు మాత్రమే ప్రశ్నలడిగే అవకాశమిచ్చారు, వాటికి కూడా ముందే జవాబులు సిద్ధం చేసుకున్నారు. ఇలా చినబాబు తొలిసారి ట్విట్టర్ వదిలి మీడియా ముందుకొచ్చారు.

కనీసం ఇలాగైనా తమ యువరాజు బైటకొచ్చాడని టీడీపీలో ఓ వర్గం సంబరపడుతోంది. తాము కోరుకుంటుంది కూడా ఇదేనని, ఇలా బైటకొచ్చి తన పరువు తానే పోగొట్టుకుంటే.. లోకేష్ అసమర్థత మరింతగా ఎక్స్ పోజ్ అవుతుందని మరో వర్గం ఎదురు చూస్తోంది. 

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు