మన్మధుడా? మజాకానా?

what the f**k…f**k..f**king..b***ard..b***ardo..madarchod..behanchod Advertisement ఈ పదాలన్నీ వరుసగా పేర్చి, అర్జున్ రెడ్డి సినిమానో మరోటో గుర్తుచేయడం లేదు. ఫ్యామిలీ హీరోలు అని పేరు పడిన సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున చేసిన మన్మధుడు…

what the f**k…f**k..f**king..b***ard..b***ardo..madarchod..behanchod

ఈ పదాలన్నీ వరుసగా పేర్చి, అర్జున్ రెడ్డి సినిమానో మరోటో గుర్తుచేయడం లేదు. ఫ్యామిలీ హీరోలు అని పేరు పడిన సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున చేసిన మన్మధుడు 2 సినిమా వ్యవహారమే ఇది. ఈ పదాలు అన్నీ సెన్సారు వారు మర్యాదగా మ్యూట్ చేయించేసారు అనుకోండి.

అయినా నాగార్జున-రాహుల్ రవీంద్రన్ కలిసి ఇలాంటి పదాలు అన్నీ వాడి ఫ్యామిలీ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో? ఇప్పుడు మ్యూట్ చేసినంత మాత్రాన వాళ్లకు పోయిందేమీ వుండదు. ఆ సీన్, ఆ పదం ముందు వెనుక మాటలు బట్టి జనం ఊహించేసుకుంటారు.  అదే సినిమా మేకర్ల ధీమా. 

ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అని పెట్టుకుని, ఇలా విచ్చల విడిగా బూతులు వాడించేయడం అంటే హీరో నాగార్జున కూడా హిట్ కోసం ఎంత తపన పడుతున్నాడో అర్థం అయిపోతుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో శృంగారం పాలు రంగరించి హిట్ కొట్టాడు. ఇదేదో బాగుంది అని ఈ దారిలో మరింత ముందుకు వెళ్లి మన్మధుడు 2 సినిమా తీసినట్లు కనిపిస్తోంది. 

అన్నట్లు ఇదే సినిమాలో హీరోయిన్ రకుల్ కు యాంకర్ ఝాన్సీకి మధ్య ఓ ముద్దు సీన్ వుందట దాన్ని కూడా సిజి షాట్స్ లో కనిపించకుండా కవర్ చేసేయమన్నారు సెన్సారు జనాలు.

మొత్తానికి కుర్రకారు సినిమాలు చూసి, నాగ్ కూడా ఇంగ్లీష్ బూతులే సక్సెస్ మంత్ర అని అనుకుంటున్నారేమో?

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?