ఎంపీగారిలో కొత్త టాలెంట్.. ఇరగదీశారే….

ఆయన ఎంపీ. అది కూడా ప్రతిష్టాత్మకమైన విశాఖ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ. ఆయన పూర్వాశ్రమంలో సినీ నిర్మాత కూడా. అలాగే నటకకు పదును పెట్టి…

ఆయన ఎంపీ. అది కూడా ప్రతిష్టాత్మకమైన విశాఖ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ. ఆయన పూర్వాశ్రమంలో సినీ నిర్మాత కూడా. అలాగే నటకకు పదును పెట్టి చిన్న పాత్రలు కూడా వేశారని వినికిడి. అలాంటి ఆయన దసరా ఉత్సవాల సందర్భంగా తనలోకి కొత్త టాలెంట్ ని జనాల ఎదుట బాగానే బయట‌ పెట్టుకున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో దసరా వేళ జరిగిన ఒక కార్యక్రమంలో ఎంపీగారు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. నిజంగా రెగ్యులర్ గా సినిమా హీరోలు చేసే డ్యాన్స్ మాదిరిగానే ఆయన ఎక్కడా మూవ్మెంట్స్ అవీ తగ్గకుండా ఇరగదీశారు.

ఒక స్పీడ్ పాటకు అనుగుణంగా ఆయన లయబద్ధంగా చేసిన ఈ డ్యాన్స్ కి ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈలలు గోలలతో అక్కడంతాఒక్కసారిగా ఉర్రూతలూగిపోయింది. 

ఎంపీ గారి డ్యాన్స్ కి హుషారెత్తిన జనాలు చప్పట్లు కొడుతూ మరీ ఉత్సహాపరచారు. మన ఎంపీగారిలో ఇంతటి టాలెంట్ ఉందా అని అనుకునెలా అందరికీ ఆయన దసరా వేళ షాక్ తినిపించేశారు.