ఫ్లాప్ లలో హీరోయిన్.. ఖర్చులకూ ఇబ్బందేనట!

తను గతంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటుంది పరిణితీ చోప్రా. ఆ మధ్య మీటూ ఉదంతం చెలరేగినప్పుడు తన చిన్నప్పుడు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరించింది. తనను కొంతమంది ఆకతాయిలు…

తను గతంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అప్పుడప్పుడు వివరిస్తూ ఉంటుంది పరిణితీ చోప్రా. ఆ మధ్య మీటూ ఉదంతం చెలరేగినప్పుడు తన చిన్నప్పుడు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరించింది. తనను కొంతమంది ఆకతాయిలు ఇబ్బంది పెట్టేవారని, తను స్కూల్ కు వెళ్లే రోజుల్లో అలా ఇబ్బంది పడినట్టుగా ఈ హీరోయిన్ వివరించింది.

ఇక తాజాగా ఈ నటీమణి తను గతంలో ఎదుర్కొన్నఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పింది. నాలుగైదేళ్ల కిందట తను వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడినట్టుగా పరిణితి చెప్పింది. సినిమాలు ఫ్లాపులుగా మిగలడం, కొత్త అవకాశాలు రాకపోవడంతో తను ఇబ్బంది పడినట్టుగా వివరించింది.

అప్పటికే చేతిలో ఉన్న డబ్బుతో ఇళ్లు కొనడం, వేరే పెట్టుబడులు పెట్టేయడం జరిగిందని.. దీంతో రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయినట్టుగా పరిణితి వివరించింది. ఆ ఆర్థిక కష్టాల్లో తను డిప్రెషన్లో కూరుకుపోయినట్టుగా వివరించింది.

ఎప్పుడూ ఏడుస్తూ కూర్చునేదాన్ని అని ఈ హీరోయిన్ తన గురించి చెప్పింది. అయితే సన్నిహితులు ఊరడించేవారని, వారి సహకారంతోనే తను కోలుకున్నట్టుగా పరిణితి వివరించింది.

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్