ప్రజల ఆకాంక్షల గురించి కాంగ్రెస్ మాట్లాడటమా!

కశ్మీర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలకు ఎంత విలువను ఇచ్చిందో అందరికీ అర్థం అవుతూనే ఉంది. ప్రస్తుతానికి బీజేపీకి ఆ శక్తి ఉంది చేస్తోంది. అయితే దీని పర్యవసనాలు  ఎలా ఉంటాయి?…

కశ్మీర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలకు ఎంత విలువను ఇచ్చిందో అందరికీ అర్థం అవుతూనే ఉంది. ప్రస్తుతానికి బీజేపీకి ఆ శక్తి ఉంది చేస్తోంది. అయితే దీని పర్యవసనాలు  ఎలా ఉంటాయి? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.

అయితే ఈ పర్యవసనాలు యావత్ భారతదేశం అనుభవించాల్సి రావొచ్చు. ఈ నిర్ణయాలతో కశ్మీర్లో ఉగ్రవాదం రూపుమాపబడుతుందని చెబుతున్నారు. అయితే నోట్లరద్దు దగ్గర నుంచి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నారు భారతీయ ప్రజలు. కాబట్టి మాటలుకాదు, చేతల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కొన్ని సంవత్సరాలకు గానూ క్లారిటీ రాకపోవచ్చు.

భారత ప్రభుత్వ తీరుతో కశ్మీరీ ప్రజల్లో మరింత విపరీత ధోరణులు పెరగవచ్చు. ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఓటేసింది కేవలం పదిశాతం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు వారు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఆ సంగతలా ఉంటే.. కశ్మీరీల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ వాపోతోంది. అయినా ఈ విషయంలో కాంగ్రెస్ కు మాట్లాడే హక్కు ఉందా?

ఇదివరకూ ఉమ్మడి ఏపీని విభజించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకుందా? తమ చేతిలో అధికారం ఉంది కాబట్టి అప్పుడు కాంగ్రెస్ విడదీసింది. ఇప్పుడు బీజేపీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి తను చేయాలనుకున్నది చేస్తోంది. పర్యవసనాలు అటు దేశానికి, ఇటు బీజేపీకి ముందు ముందు అర్థం అవుతాయి!

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్