మిస్టర్ ప్రెగ్నెంట్..కొత్త ఎక్స్ పీరియన్స్

మైక్ మూవీస్ బ్యానర్ పై కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు అప్పిరెడ్డి. సోహైల్, రూపా కొడవయూర్ జంటగా ఆయన నిర్మించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. ఇవాళ ఈ…

మైక్ మూవీస్ బ్యానర్ పై కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు అప్పిరెడ్డి. సోహైల్, రూపా కొడవయూర్ జంటగా ఆయన నిర్మించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో గ్రేట్ ఆంధ్రతో అప్పిరెడ్డి చేసిన ఇంటర్వ్యూ రిలీజైంది. ఈ ఇంటర్వ్యూ హైలైట్స్.

స్క్రిప్ట్ డిమాండ్ మేరకే మిస్టర్ ప్రెగ్నెంట్ కు ఖర్చు పెట్టాం. మా గత సినిమాల కంటే ఎక్కువే ఖర్చయ్యింది. ఎక్కువ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. ఎన్ని ఏళ్లయినా మిస్టర్ ప్రెగ్నెంట్ గురించి తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటారు.

మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కోసం మొదట విశ్వక్ సేన్ ను అప్రోచ్ అయ్యాం. కానీ ఆయనకు కథ చెప్పలేదు. మొన్న ఫంక్షన్ లో కలిసినప్పుడు మీరు ఈ లైన్ చెప్పలేదు. చెప్పి ఉంటే నేనే చేసేవాడిని అన్నాడు.

మిస్టర్ ప్రెగ్నెంట్ కత్తి మీద సాము లాంటి స్క్రిప్ట్. దర్శకుడు శ్రీనివాస్ బాగా హ్యాండిల్ చేశాడు. ప్రేక్షకులకు కొత్త ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. యూఎస్ ప్రీమియర్ షోస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే తెలుగు స్టేట్స్ లో రెస్పాన్స్ బాగుంది.

ఎన్ఆర్ లు చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. మరింత మంది రాబోతున్నారు.

ఫస్ట్ కాపీ రాగానే సినిమా పూర్తయినట్లు కాదు. అది ఇంటర్వెల్ మాత్రమే. అసలు సినిమా రిలీజ్ టైమ్ లో మొదలవుతుంది. మేకింగ్ ఈజీ, రిలీజ్ కష్టం

మేకింగ్ లో అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చువుతోంది. ఆ ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయితే ఏ ఇండస్ట్రీలోనైనా సక్సెస్ కావొచ్చు. ఇది అంత కష్టమైన ఫీల్డ్.

సినిమా ను ఓటీటీ కోసం ప్రొడ్యూస్ చేయొద్దు. థియేటర్ లో రిలీజ్ చేయగలిగితేనే ప్రొడ్యూస్ చేయాలి.

స్లమ్ డాగ్ హజ్బెండ్ ను రైట్ టైమ్ లో రిలీజ్ చేయలేకపోయాం. అందుకే ఎక్స్ పెక్టేషన్స్ అందుకోలేదు.

మా సంస్థలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. ప్రస్తుతం మా బ్యానర్ లో ఐదు సినిమాలు చేస్తున్నాం.