దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పాటీ. అధినాయకుడు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. అటువంటి పార్టీని గత ఏడాది చరిత్రలో కనీవినీ ఎరగని పరాజయం పలకరించింది. అంతే దెబ్బకు డీలా పడిపోయింది.
సరే ఏడాది అయింది ఫలితాలు వచ్చి. ఇపుడు విపక్షంగా టీడీపీ ఎలాగుంది అంతే పూర్తిగా ఆన్ లైన్ పార్టీగా మారిందని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనక్షేత్రంలోకి రావడం మానేసి ఆన్ లైన్ రాజకీయాలు చేస్తూ మరింతగా కనుమరుగైపోతోందని వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదరి అప్పలరాజు హాట్ కామెంట్స్ చేశారు.
తెలుగుదేశం పార్టీ మరి ఇంతలా దిగజారిపోతుందని అనుకోలేదని అంటున్నారు. దేశంలోనే గర్వించే విధంగా పాలన చేస్తున్న జగన్ మీద లేని పోని ఆరోపణలను చేస్తూ ఆన్ లైన్ పాలిటిక్స్ తో టైం పాస్ చేస్తోందని ఎద్దేవా చేశారు. వైసీపీకి గత ఏడాది ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వచ్చాయని, ఏడాది కాలంలో జనాదరణ పెరిగి అది 78 శాతానికి చేరుకుందని అప్పలరాజు అంటున్నారు.
తొంబై శాతం పైగా హామీలు నెరవేర్చిన పార్టీలో తాము ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామని, అటువంటి తమ మీద బురద జల్లుతూ సోషల్ మీడియాలో బురద జల్లుతూ పచ్చ పార్టీ అదే విజయం అనుకోవడం దారుణమన్నారు. మొత్తానికి ఆన్ లైన్ పార్టీగా టీడీపీ మరింతగా జనానికి దూరంగా, భారంగా మారిందని తేల్చేశారు.