ఇలియానా మనసు మార్చుకుందా?

ఆకలి పీడిస్తే, సింహం అయినా గడ్డి తినాల్సిందే అన్నది సామెత. హీరోయిన్ గానే వేస్తా..హీరోగానే నటిస్తా..మరే ఇతర పాత్రలు వేయను, ఐటమ్ సాంగ్ లు చేయను అని భీష్మించుకున్న వారు కూడా ఫేడవుట్ అయిపోతుంటే,…

ఆకలి పీడిస్తే, సింహం అయినా గడ్డి తినాల్సిందే అన్నది సామెత. హీరోయిన్ గానే వేస్తా..హీరోగానే నటిస్తా..మరే ఇతర పాత్రలు వేయను, ఐటమ్ సాంగ్ లు చేయను అని భీష్మించుకున్న వారు కూడా ఫేడవుట్ అయిపోతుంటే, దిగి రావాల్సిందే. 

తెలుగు సినిమాల్లో మళ్లీ అడగంటూ పెడితే హీరోయిన్ గానే అంటూ భీష్మించుకుని కూర్చుంది ఇలియానా. ఆ మధ్య అంథాదూన్ రీమేక్ కు అడిగితే కూడా అందుకే నో అనేసింది. అలాంటిది ఇప్పుడు ఐటమ్ సాంగ్ కు రెడీ అయిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్ కు ఇలియానాను అడుగుతున్నారట. ఆమె కూడా సానుకూలంగానే వుందట అంటూ వార్తలు వినిపించడం ప్రారంభమైంది.

అంటే ఇలియానా మనసు మార్చుకుని ఐటమ్ సాంగ్ లు చేయడానికి డిసైడ అయినట్లా? ఈ విషయంలో తమన్నానుఆదర్శంగా తీసుకోవాలి. సాంగ్ కాదు, పాత్ర కాదు, ఏదయినా తన దగ్గరకు వచ్చింది బాగుంటే చాలు చేసుకుంటూ వెళ్తోంది. అందుకే టాలీవుడ్ లో ఫేడవుట్ కాకుండా కంటిన్యూ అవుతోంది.