సీటీమార్ కు ఢిల్లీ సమస్య

తెలుగు సినిమాలు చాలా వాటికి ఇప్పుడు లొకేషన్ల సమస్య పట్టుకుంది. హైదరాబాద్ మినహా మరే చోట షూటింగ్ చేయాలని వున్నా సమస్యే.  అమెరికా లాంటి విదేశాలు, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ ప్రదేశాల్లో షూటింగ్ లు…

తెలుగు సినిమాలు చాలా వాటికి ఇప్పుడు లొకేషన్ల సమస్య పట్టుకుంది. హైదరాబాద్ మినహా మరే చోట షూటింగ్ చేయాలని వున్నా సమస్యే.  అమెరికా లాంటి విదేశాలు, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ ప్రదేశాల్లో షూటింగ్ లు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఎలా చేయాలో అర్థం కావడం లేదు.

అమెరికాలో షూట్ వున్న సినిమాలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. కథలు మార్చుకోవడమా? అలాగే ఇండియాలోని వేరే రాష్ట్రాల్లో షూట్ చేయాల్సిన సినిమాలు కూడా ఆలోచనలో పడ్డాయి. కొన్ని సెట్ లు వేసుకోవాలని, మరికొన్ని సిజిలతో మ్యానేజ్ చేయాలని ఆలోచనలు చేస్తున్నాయి. ఆర్ ఎఫ్ సి లో సెట్ లు వేయాలని కొన్ని సినిమాలు లెక్కలు కడుతున్నాయి.

గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లోని సీటీమార్ సినిమాకు కూడా ఇదే సమస్య వుంది. ఈ సినిమాలో చాలా భాగం ఢిల్లీ నేపథ్యంలో జరుగుతుంది. ఈ షెడ్యూలు పెండింగ్ లో వుంది. ఇప్పుడు లోకేషన్ మార్చాలా? అలా మార్చడం అంటే సినిమాకు లుక్ పోతుంది. కానీ ఢిల్లీలోనే షూట్ చేయాలంటే చాలా టైమ్ పట్టేలా వుంది. పోనీ కీలకమైన కబడ్డీ ఆడిటోరియం సీన్లు అన్నీ ఇక్కడ తీసినా, ఆన్ రోడ్ తీయాల్సిన సీన్లు వుండనే వుంటాయి.

అలాగే పూరిజగన్నాధ్ సినిమాకు అమెరికా షెడ్యూలు పెద్దది వుంది. అలాగే ముంబాయి వీధుల్లో షూట్ చేయాలి. ఆ సినిమా పరిస్థితి కూడా వెయింటింగ్ లో పడింది.  రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు గుజరాత్, రాజస్థాన్ ల్లో షెడ్యూళ్లు వున్నాయి. అవీ రీషెడ్యూలు ఆలోచనల్లో వున్నాయి. మొత్తం మీద కరోనా వచ్చి సినిమాలు అన్నింటినీ అయోమయంలో పడేసింది.

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?