ఇండస్ట్రీ అంతా ఒక తాటిపైకి వస్తుంది అంటే అది పెద్ద బూతు-ఆర్జీవీ
దర్శకుడు ఆర్జీవీ అన్నది వినడానికి సరదాగానే వుంది కానీ అదే పక్కా నిజం అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో ఇండస్ట్రీ మీటింగ్ పెడితే చాలా గుసగుసలు వినిపించాయి. వీళ్లను పిలవలేదు..వాళ్లను పిలవలేదు. పైగా చాంబర్ వదిలేసి, ఇంట్లో మీటింగ్ లు ఏమిటి? అని. అంతే కాదు, కీలకమైన వారిని చాలా మందిని ఆ సమావేశానికి పిలవలేదని, అలాగే సిఎమ్ కేసిఆర్ దగ్గరకు వెళ్లినపుడు కూడా కీలకమైన వారిని తీసుకెళ్లకుండా, ఏనాడో ఒకటి రెండు డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడిని తీసుకెళ్లారని కామెంట్లు వినిపించాయి.
ఇప్పుడు దర్శకుడు రాజమౌళి వంతు వచ్చింది. దర్శకుడు రాజమౌళి దర్శకుల సంఘాన్ని కాదని, తన చేతిలోకి నాయకత్వ పగ్గాలు తీసుకుంటున్నారని విమర్శలు వినవస్తున్నాయి. దర్శకులతో పెడుతున్న సమావేశాలకు కొందరిని పిలిచి కొందరిని పిలవలేదని అంటున్నారు. దర్శక సంఘం నేత శంకర్ ను కానీ, శ్రీకాంత్ అడ్డాల, వెంకీ కుడుమల లాంటి వారిని కానీ పిలవలేదని అంటున్నారు. అలాగే ఆయన కూడా తన ఇష్టం వచ్చిన చోట సమావేశాలు నిర్వహిస్తున్నారని, రాజమౌళికి తన భవిష్యత్ సినిమాలతో అవసరం దృష్ట్యా కొరటాల శివ, త్రివిక్రమ్ సపోర్ట్ చేస్తున్నారని ఇండస్ట్రీ జనాలు కామెంట్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ చానెల్ ఓ కథనాన్ని కూడా ప్రసారం చేయడం విశేషం.
మొత్తం మీద కరోనా నేపథ్యంలో ఇండస్ట్రీ ఒక తాటిపైకి వస్తుందనే హడావుడి జరిగింది తప్ప, అదే సమయంలో ఎన్ని వర్గాలు వున్నాయో, అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇటీవల ఓ విషయంలో తన మాట చెల్లలేదని ఓ అగ్రదర్ళకుడు ఓ అగ్ర హీరో బర్త్ డే కు విసెష్ కూడా చెప్పలేదని టాక్ వుంది. మొత్తం మీద టాలీవుడ్ లో షూటింగ్ ల హఢావుడి లేకున్నా, తెరవెనుక హడావుడి మాత్రం బాగానే వున్నట్లు కనిపిస్తోంది.