Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెడికోగా సాయితేజ్?

మెడికోగా సాయితేజ్?

సెట్ మీద ఒకటి, సెట్ మీదకు వెళ్లాల్సింది మరోటి చేతిలో వుంచుకున్న హీరో సాయి తేజ్ ఇంకో సబ్జెక్ట్ కూడా డిస్కషన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఓ కొత్త రైటర్ తెచ్చిన సబ్జెక్ట్ ను దాదాపు ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఈ సబ్జెక్ట్ లో హీరో మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తాడు. మెడికల్ బ్యాక్ గ్రవుండ్ సబ్జెక్ట్ కావడంతో, ఈ సబ్జెక్ట్ ను తనకు బాగా సన్నిహితమైన, వైద్య నేపథ్యం వున్న వ్యక్తికి కూడా వినిపింపచేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విడుదల కావాల్సిన సోలో బతుకే సినిమా తరువాత దేవా కట్టా డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. భగవాన్ పుల్లారావు నిర్మాత. ఆ తరువాత మళ్లీ మరో సినిమాను బివివిఎస్ఎన్ ప్రసాద్ కే చేయాలి. కానీ ఆ ప్రాజెక్టుకు దిల్ రాజు, వైష్ణో కృష్ణలతో కలిపి, ముగ్గురు నిర్మాతల భాగస్వామ్యంలో చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

మరి ఆ ప్రాజెక్టు కో, లేదా, ముందుగా రెడీ చేసి వుంచడానికో ఈ మెడికల్ స్టూడెంట్ బ్యాక్ గ్రవుండ్ సినిమాను కూడా డిస్కషన్ లో వుంచినట్లు తెలుస్తోంది. అలాగే గోపీచంద్ మలినేని కూడా వ్యాపమ్ స్కామ్ నేపథ్యంలో ఓ స్క్రిప్ట్ సాయి తేజ్ కోసం రెడీ చేసి వుంచారు. మరి ప్రాజెక్టు ఏమయిందో తెలియదు.

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?