ఓటీటీ కోసం సినిమా

థియేటర్ మార్కెట్ అవకాశం తక్కువ వున్నవాళ్లు ఇప్పుడు ఓటిటి ల కేసి చూస్తున్నారు. రివర్స్ ల్లో లెక్కలు చేస్తున్నారు. ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ల నుంచి ఎంత వస్తుందో లెక్కలు కట్టి,…

థియేటర్ మార్కెట్ అవకాశం తక్కువ వున్నవాళ్లు ఇప్పుడు ఓటిటి ల కేసి చూస్తున్నారు. రివర్స్ ల్లో లెక్కలు చేస్తున్నారు. ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ల నుంచి ఎంత వస్తుందో లెక్కలు కట్టి, ఆ బడ్జెట్ లో సినిమాలు చేసి, ఓటిటి లకు అమ్మేసే ఆలోచనలు చేస్తున్నారు. రెండు, మూడు కోట్ల రేంజ్ లో సినిమాలుచేస్తే, ఓటిటి లకు ఇస్తే అంతో ఇంతో లాభం వస్తుంది.

ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో వున్న సీనియర్ హీరో రాజశేఖర్ తన తరువాత సినిమాను వీలయినంత తక్కువ బడ్జెట్ లో తీయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా. పలాసలాంటి సినిమాను అందించిన దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తారని, ఇందుకోసం ఓ రీమేక్ సబ్జెక్టు ను రెడీ చేసారని తెలుస్తోంది.

ఇలాంటి ఐడియా సక్సెస్ అయితే థియేటర్ మార్కెట్ తక్కువ వున్న హీరోలు అంతా ఈ బాటను పట్టే అవకాశం వుంది.

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?