ప్ర‌భాస్ తో మ‌రో సినిమా అంటున్న నిర్మాత‌!

టీ సీరిస్ సంస్థ అధిప‌తి భూష‌న్ కుమార్ త‌ను ప్ర‌భాస్ తో మ‌రో సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. తాజాగా టీజ‌ర్ విడుద‌ల అయిన *ఆదిపురుష్* సినిమా నిర్మాత ఈ భూష‌న్ కుమారే. ఒక‌వైపు ఆదిపురుష్…

టీ సీరిస్ సంస్థ అధిప‌తి భూష‌న్ కుమార్ త‌ను ప్ర‌భాస్ తో మ‌రో సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. తాజాగా టీజ‌ర్ విడుద‌ల అయిన *ఆదిపురుష్* సినిమా నిర్మాత ఈ భూష‌న్ కుమారే. ఒక‌వైపు ఆదిపురుష్ సినిమా టీజ‌ర్ పై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తం అవుతూ ఉంది. ప్ర‌త్యేకించి ఈ టీజ‌ర్ ను ట్రోల్ చేస్తున్నారు మీమ‌ర్స్.

ఇదో కార్టూన్ సినిమాలా ఉంద‌నే అభిప్రాయాలు హైలెట్ అవుతున్నాయి. క్వాలిటీ సంగ‌తెలా ఉన్నా.. ఈ త‌ర‌హా బొమ్మ‌లు స‌గ‌టు ప్రేక్ష‌కుడితో క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే అని స్ప‌ష్టం అవుతోంది. ఇలాంటి సినిమాలు హాలీవుడ్ నుంచి వ‌స్తే భార‌తీయులు ఆద‌రిస్తారేమో కానీ, లోక‌ల్ మేడ్ సినిమాలు స‌రైన హిట్ అయిన దాఖ‌లాలు లేవు.

ర‌జ‌నీకాంత్ ఇలానే భారీ అంచ‌నాల‌ను పెట్టి *సుల్తాన్* అంటూ ఒక సినిమా చేసిన‌ట్టుగా ఉన్నారు. దాదాపు ద‌శాబ్దం కింద‌టే జ‌రిగిన ఆ ప్ర‌య‌త్నం విక‌టించింది. ఆ సినిమా ర‌జ‌నీకాంత్ కెరీర్ లోనే పెద్ద‌డిజాస్టర్ గా నిలిచింది. క‌థా,క‌థ‌నాల సంగ‌తెలా ఉన్నా.. ఈ త‌ర‌హా పిక్చ‌ర్స్ ప్రేక్ష‌కుల‌తో క‌నెక్ట్ కావ‌డం క‌ష్టం లాగుంది.

అంత వ‌ర‌కూ నిండైన ఆకారాన్ని తెర‌పై చూశాకా.. జీవం లేని గ్రాఫిక్స్ త‌ర‌హాలో హీరోల‌ను చూడ‌టం తేలికేమీ కాదు. ఇదే ఈ త‌ర‌హా సినిమాల‌కు పెద్ద మైన‌స్ పాయింట్. ఇప్పుడు ఆదిపురుష్ టీజ‌ర్ కు వ‌స్తున్న స్పంద‌న కూడా ఇదే విష‌యాన్ని చాటుతోంది.

మ‌రి ఈ సినిమా టీజ‌ర్ కు వ‌స్తున్న స్పంద‌న సంగ‌తెలా ఉన్నా.. భూష‌న్ కుమార్ మాత్రం ప్ర‌భాస్ తో మ‌రో సినిమా తీస్తానంటూ ముందే ప్ర‌క‌టించేసుకుంటున్నారు. మ‌రి ముందు ఆదిపురుష్ ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందనే దాన్ని బ‌ట్టే.. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు కార్య‌రూపం దాలుస్తాయ‌ని వేరే అంచ‌నా వేయ‌న‌క్క‌ర్లేదు!