సీన్ రివర్స్: లోకేష్ బాటలో చంద్రబాబు

చంద్రబాబు బాటలో నడవాల్సిన లోకేష్.. ఏకంగా తండ్రిని తన దారిలోకి తీసుకొచ్చాడు. మొన్నటివరకు లోకేష్ మాత్రమే ట్విట్టర్ పక్షి. ఇప్పుడు తండ్రి చంద్రబాబు కూడా లోకేష్ ను అనుసరిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు ట్వీట్లు పెడుతూ తండ్రికొడుకులిద్దరూ…

చంద్రబాబు బాటలో నడవాల్సిన లోకేష్.. ఏకంగా తండ్రిని తన దారిలోకి తీసుకొచ్చాడు. మొన్నటివరకు లోకేష్ మాత్రమే ట్విట్టర్ పక్షి. ఇప్పుడు తండ్రి చంద్రబాబు కూడా లోకేష్ ను అనుసరిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు ట్వీట్లు పెడుతూ తండ్రికొడుకులిద్దరూ దొందూ దొందే అనిపించుకుంటున్నారు.

నారావారి రాజకీయ క్రీడలే వేరు. అవసరమనుకుంటేనే బైటకొస్తారు, అవసరం లేకపోతే ఇంట్లోనే లాక్ అయిపోతారు. కరోనా కంటే ముందే లాక్ డౌన్ పాలసీని పాటించడం అలవాటు చేసుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబే. కరోనా దెబ్బతో తెలంగాణకు పారిపోయి ఇంట్లో దాక్కున్నారు చంద్రబాబు జూమ్ రాజకీయాలకు తెరతీశారు. సాయంత్రం కాగానే జూమ్ లోకొచ్చి, ప్రభుత్వంపై రంకెలేసి, డిన్నర్ టైమ్ కి లైవ్ కట్టేసేవారు. ఒకేఒక్కసారి ఏపీలో అడుగుపెట్టినప్పటికీ.. జూమ్ మహానాడు అయిపోయిన వెంటనే తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ వెళ్లిన బాబు పూర్తిగా ట్విట్టర్ కే పరిమితమైపోయారు.

వైసీపీ ఏడాది పాలనపై ట్విట్టర్లోనే ఏడుపులన్నీ. మహానాడు అయిపోయి వారం దాటిపోయింది. ఇప్పటి వరకూ చంద్రబాబు బైట కనపడలేదు, ఓ ప్రెస్ మీట్ లేదు, కనీసం జూమ్ లో కూడా అడ్రస్ లేదు. కేవలం ట్విట్టర్ లో పోస్టింగ్ లు పెట్టుకుంటూ, పచ్చపాత మీడియాలో వాటిని హైలెట్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. లాక్ డౌన్ పేరుతో ఇన్నాళ్లూ హైదరాబాద్ లో లాక్ అయిపోయిన చంద్రబాబు.. అన్ లాక్ వేళ కూడా ప్రజల్లో లేకుండా చేవ చచ్చి సోషల్ మీడియా రాజకీయాలు చేసుకుంటున్నారు. అలా తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండా లోకేష్ బాటలోకి వచ్చేశారు బాబు. తండ్రికొడుకులిద్దరూ ఎంచక్కా ట్విట్టర్ లో రాజకీయాలు చేస్తూ.. పొలిటికల్ కాలక్షేపం చేస్తున్నారు.

నిజానికి ఈ పరిణామాన్ని టీడీపీ శ్రేణులు కూడా ఊహించలేకపోయాయి. మొన్నటివరకు లోకేష్ మాత్రమే ట్విట్టర్ కు పరిమితం అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు కూడా దానికే పరిమితం అయిపోయారు. బాబుకు వంతపాడే సోమిరెడ్డి లాంటి నేతలు కూడా సోషల్ మీడియాకే పరిమితం అవ్వడంతో.. మొత్తం టీడీపీ అంతా ఇప్పుడు ప్రజలకు దూరంగా, సోషల్ మీడియా పార్టీగా తయారైంది.

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?