‘మా ఇండస్ట్రీని ఇలా వుండనివ్వండి’

తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలు వేరు, కన్నడ ఇండస్ట్రీ వ్యవహారాలు వేరు. మన పెద్ద సినిమా బడ్జెట్ తో అక్కడ మూడు నాలుగు సినిమాలు తీసేయవచ్చు. కేజిఎఫ్ లాంటి ఒకటి రెండు సినిమాలు మాత్రం…

తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలు వేరు, కన్నడ ఇండస్ట్రీ వ్యవహారాలు వేరు. మన పెద్ద సినిమా బడ్జెట్ తో అక్కడ మూడు నాలుగు సినిమాలు తీసేయవచ్చు. కేజిఎఫ్ లాంటి ఒకటి రెండు సినిమాలు మాత్రం మినహాయింపు. ఇష్టం వచ్చినట్లు రెమ్యూనిరేషన్లు, వ్యవహారాలు తక్కువ. అలాంటి నేపథ్యంలో కేజిఎఫ్-2 డైరక్టర్ ప్రశాంత్ నీల్ కోసం మన తెలుగు బ్యానర్లు పోటీ పడడం ప్రారంభించాయి.

సరే, రెమ్యూనిరేషన్ల సంగతి పక్కన పెడితే. ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా అక్కడ ఫుల్ ఫేజీ ప్రకటనలు, నేషనల్ డైలీలో కలర్ ఫుల్ పావుపేజీ ప్రకటనలు ఇచ్చి హడావుడి చేసారు మన నిర్మాతలు. ఇది చూసి కన్నడ నిర్మాతలు కిందా మీదా అవుతున్నారట. 

నిజానికి పుట్టిన రోజుకు ప్రకటనలు ఇవ్వకూడదని ఇక్కడ మన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీర్మానం. దిల్ రాజు సారధ్యంలోని ఈ గిల్డ్ సభ్యులంతా తీర్మానాలను తమకు అవసరం అయినపుడు ఉల్లంఘిస్తుంటారనే కామెంట్లు వున్నాయి. మరి ఇదే గిల్డ్ సభ్యులు వెళ్లి కన్నడ నాట అంత భారీగా ప్రకటనలు ఇచ్చారు.

దీనిపై టాలీవుడ్ జనాలతో పరిచయం వున్న కన్నడ నిర్మాతలు కొందరు, …. 'మీ వాళ్లు వచ్చి ఇక్కడ మా ఇండస్ట్రీని చెడగొట్టేలా వున్నారు. ఇలాంటి హడావుడి, అదీ అలవాటు చేసి, మా డైరక్టర్లను పాంపర్ చేస్తున్నారు..ఇప్పుడు ఇక మా నుంచి కూడా ఇలాంటివి అన్నీ ఆశిస్తారు '' అని అన్నట్లు తెలుస్తోంది…

చిత్రమేమిటంటే, ఇక్కడ ఇందరు టాప్ డైరక్టర్లు వున్నారు. కానీ ఎప్పుడు ఫుల్ పేజీ ప్రకటనలు వాళ్ల బర్త్ డే లకు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని డైరక్టర్ కు ఇంత హడావుడి ఏమిటో?

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?