తెలంగాణలో తర్వలో జరగబోతున్న మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 7న నోటిఫికేషన్ వెలువడునుండగా నంబర్ 3 న ఉపఎన్నిక ఉండబోతున్నది ఎన్నికల సంఘం ప్రకటించింది.
పార్టీల అభ్యర్ధుల నామినేషన్లు అక్టోబర్ 14 వరకు దాఖలు చేయవచ్చని.. నామినేషన్ల ఉససంహరణకు అక్టోబర్ చివరి తేది అని ప్రకటించింది. నంబర్ 3న పోలింగ్ ఉండగా నంబర్ 6 న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
తెలంగాణ మునుగోడు ఉప ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలో (మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా)లోని పలు స్ధానాల్లో బై పోల్స్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల రిలీజ్ చేసింది.
తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా మునుగోడు ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించి ప్రచారం చేస్తుండగా, బీజేపీ, తెరాసా కూడా అభ్యర్ధులను ప్రకటించకపోయిన ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నాయి.