వర్మ చేసిన పనికి ఆమెకు జ్వరం

నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్లు అన్నింటా ఆమెదే హవా. ప్రీరిలీజ్ లోనూ, ఆఫ్టర్ రిలీజ్ లోనూ కూడా ఆమె చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. అదే సినిమాలో మరో హీరోయిన్ నిధి…

నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్లు అన్నింటా ఆమెదే హవా. ప్రీరిలీజ్ లోనూ, ఆఫ్టర్ రిలీజ్ లోనూ కూడా ఆమె చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. అదే సినిమాలో మరో హీరోయిన్ నిధి అగర్వాల్ అస్సలు కనిపించలేదు. ఓ దశలో నిధి అగర్వాల్ ఇస్మార్ట్ క్రెడిట్ లో భాగం కోసం తనే స్వంతంగా ప్రెస్ మీట్ కూడా పెట్టబోయింది. అది తెలిసి, యూనిట్ నే ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది.

అలాంటిది ఉన్నట్లుండి నభా నటేష్ చటుక్కున మాయం అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇస్మార్ట్ టీమ్ తో నిథి అగర్వాల్ నే కనిపిస్తోంది. నభాకు ఏమయింది? పక్కన పెట్టారా? లేక ఆమెనే తప్పుకుందా? అన్నది ఎంక్వయిరీ చేస్తే, నభా నటేష్ తీవ్రంగా జ్వరం పడిందని తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ విజయోత్సవాలలో భాగంగా లేట్ నైట్ పార్టీలు జరిగాయి. ఓ పార్టీలో అయితే డైరక్టర్ ఆర్జీవీ చేసిన హంగామా ఇంతా అంతా కాదు. షాంపేన్ బాటిల్ ఓపెన్ చేసి అందరి తలలపై ఒంపి ఒంపి రచ్చ రచ్చ చేసాడు ఆయన. పనిలో పనిగా ఆయన కూడా షాంపేన్ లో స్నానం చేసాడనుకోండి.

మొత్తానికి ఆ మర్నాడే నభా తీవ్రంగా జ్వరం పడిపోయి, బెంగళూరు వెళ్లిపోయిందట. అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా కోలుకోలేదని బోగట్టా. మరో కొన్ని రోజుల్లో రవితేజ డిస్కోరాజా షూటింగ్ కు వెళ్లాల్సి వుంది నభానటేష్.

'కామ్రేడ్'కు నిర్వచనం అదా!