పూజాహెగ్డే.. గ్లామర్ వొలకబోయడంలో ఇప్పుడు టాప్ లైన్ లో వున్న హీరోయిన్. ఎన్టీఆర్, మహేష్, బన్నీ ఇలా అందరి సరసన ఆమెనే. లేటెస్ట్ గా బన్నీ సరసన రెండోసారి చేస్తోంది. అందుకే ఆమె అయితే బాగుంటుంది అంటున్నాడట అక్కినేని అఖిల్ కూడా.
బొమ్మరిల్లు భాస్కర్-అఖిల్ కాంబినేషన్ లో గీతా2 సంస్థ నిర్మిస్తోంది ఓ సినిమాను. ఈ సినిమా సెట్ మీదకు అయితే వెళ్లింది కానీ ఇప్పటికీ హీరోయిన్ ఫిక్స్ కాలేదు. అందమైన ఓ కొత్త అమ్మాయిని నిర్మాత బన్నీ వాస్ ఫైనల్ చేసినట్లు బోగట్టా.
కానీ అఖిల్ మాత్రం కాస్త టాప్ హీరోయిన్ ఎవరన్నా కావాలని అంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పూజాహెగ్డే, కానీ ఆ రేంజ్ హీరోయిన్ లు ఎవరన్నా అయితే బెటర్ అని అఖిల్ సజెస్ట్ చేస్తున్నట్లు బోగట్టా. ఈ జంఝాటంలో అఖిల్ సినిమా హీరోయిన్ ఎంపిక పెండింగ్ లో పడింది.
ప్రస్తుతం ఏ మాటా చెప్పడానికి అఖిల్ డాడీ నాగ్ కూడా తన మన్మధుడు 2 సినిమాలో బిజీగా వున్నారు. అది విడుదలయితే కానీ ఈ సమస్య కొలిక్కి రాదేమో?