మహేష్ కు నచ్చనిది బన్నీకి ఏం నచ్చిందబ్బా?

బన్నీ-సుకుమార్ మధ్య చర్చలు పూర్తయ్యాయి. త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ సినిమానే స్టార్ట్ చేయబోతున్నట్టు అల్లుఅర్జున్ క్లారిటీ ఇచ్చేశాడు. కథ సూపర్ గా ఉందంటూ ఫీలర్లు కూడా వదిలారు. ఇదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే.…

బన్నీ-సుకుమార్ మధ్య చర్చలు పూర్తయ్యాయి. త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ సినిమానే స్టార్ట్ చేయబోతున్నట్టు అల్లుఅర్జున్ క్లారిటీ ఇచ్చేశాడు. కథ సూపర్ గా ఉందంటూ ఫీలర్లు కూడా వదిలారు. ఇదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. కానీ సోషల్ మీడియాలో డిస్కషన్ మాత్రం మరో టర్న్ తీసుకుంది. మహేష్ కు నచ్చనిది, బన్నీకి అంతలా ఏం నచ్చి ఉంటుందా అనే కోణంలో అంతా మాట్లాడుకుంటున్నారు.

నిజానికి ఈ సినిమా మహేష్ చేయాలి. ప్రాధమికంగా మహేష్-సుక్కూ మధ్య కథాచర్చలు కూడా జరిగాయి. అయితే కంప్లీట్ స్క్రీన్ ప్లే కావాలంటూ మహేష్ కొర్రీ పెట్టడంతో పాటు.. వెంటనే సినిమా చేయలేనంటూ కండిషన్ పెట్టడంతో సుకుమార్ హర్ట్ అయ్యాడు. కేవలం ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకోవడం కోసమే మహేష్ అలా కొర్రీలు పెట్టాడనే టాక్ కూడా ఉంది. ఏదైతేనేం ఆ వెంటనే సుకుమార్, బన్నీని కలవడం ప్రాజెక్టు ఓకే చేయించుకోవడం చకచకా జరిగిపోయాయి.

ఆ సినిమాకు సంబంధించి రీసెంట్ గా బన్నీ-సుకుమార్ మధ్య ఫైనల్ డిస్కషన్స్ పూర్తయ్యాయి. కథ అద్భుతంగా ఉందని బన్నీ మెచ్చుకున్నట్టు లీకులు కూడా వచ్చేశాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెల్లోనే సినిమాను లాంఛ్ చేసి, వచ్చే నెల సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వచ్చేయాలని బన్నీ తెగ ఉత్సాహం చూపిస్తున్నాడట. ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మహేష్ కంటే బన్నీని ఎందుకు అంతగా ఆకర్షించిందనే కోణంలో చర్చ షురూ అయింది.

బహుశా సినిమాలో తన గెటప్ నచ్చి బన్నీ అంతగా ఇంప్రెస్ అయి ఉంటాడని అంటున్నారు. గతంలో ఆర్య-2 సినిమాలో బన్నీని డిఫరెంట్ గా చూపించాడు సుకుమార్. ఇప్పుడీ కొత్త సినిమా కోసం కూడా మరో డిఫరెంట్ గెటప్ డిజైన్ చేశాడట. అది బన్నీకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. బహుశా ఇదే గెటప్ మహేష్ కు నచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే మేకోవర్స్, గెటప్స్ కు మహేష్ దూరం కదా.

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?