శ్రీశైలానికి జలకళ

ఈ ఏడాది పశ్చిమ కనుమల్లో కూడా వరుణుడి కరుణ తక్కువగానే ఉంది. ఆశించిన స్థాయి వర్షాలు కురవలేదు అక్కడ కూడా. ఫలితంగా ప్రాజెక్టుల్లో నీరు ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. అయితే కాస్త ఆలస్యంగా…

ఈ ఏడాది పశ్చిమ కనుమల్లో కూడా వరుణుడి కరుణ తక్కువగానే ఉంది. ఆశించిన స్థాయి వర్షాలు కురవలేదు అక్కడ కూడా. ఫలితంగా ప్రాజెక్టుల్లో నీరు ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. అయితే కాస్త ఆలస్యంగా అయినా.. వెస్ట్రన్ ఘాట్స్ లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఫలితంగా కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండి, శ్రీశైలం వరకూ నీరు చేరుతూ ఉంది. 

నిన్న ఒక్కరోజులో దాదాపు పన్నెండు టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టును చేరినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అల్మట్టి డ్యామ్ నుంచి దాదాపు ఇరవై టీఎంసీల నీళ్లు దిగువకు వదలగా, నారాయణ్ పూర్ వద్దకు వచ్చేసరికి పదిహేడు టీఎంసీల నీళ్లను కిందకు వదిలారు. 

జూరాల మీదుగా.. శ్రీశైలంలోకి పన్నెండు టీఎంసీల నీళ్లు చేరాయని తెలుస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు నలభై మూడు టీఎంసీల నీటి నిల్వలు చోటు చేసుకున్నాయి. అయితే ఇది స్వల్పమే. మరింతగా వరద వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు ఆధారిత ప్రాంతానికి ఈ ఏడాది నీళ్లు చేరే అవకాశాలు ఉండవు.

కనీసం పదిరోజుల పాటు ఇదే వరద కొనసాగాలని అందరూ ఆశిస్తున్నారు. సాధారణంగా వెస్ట్రన్ ఘాట్స్ లో ఆగస్టులో మంచి స్థాయిలో వర్షాలు ఉంటాయి. అదే జరిగితే.. ఈ ఏడాదికి గట్టెక్కినట్టే.

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?