ఎవరూ దిక్కులేని అధ్యక్ష పదవికి ఆయన!

నెలలు గడుస్తున్నా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంటోంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవిని ఎవరో ఒకరి చేత భర్తీ చేయించడం కూడా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం…

నెలలు గడుస్తున్నా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంటోంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవిని ఎవరో ఒకరి చేత భర్తీ చేయించడం కూడా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతున్నట్టుగా లేదు. ఎవరు కూర్చున్నా స్టీరింగ్ అయితే సోనియా, రాహుల్ చేతిలోనే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అయినా కూడా ఆ డమ్మీ పోస్టుకు నేతను ఎంపిక చేయడానికి చాలా కసరత్తే చేస్తూ ఉన్నట్టున్నారు.

ఈ పదవిని దక్షిణాదికి కేటాయిస్తున్నారట! కాంగ్రెస్ వాళ్లు ఈ డమ్మీ పోస్టుతో సౌత్ మీద ప్రేమను ప్రకటిస్తున్నారనమాట. మరి సౌత్ లోనే ఏ శశిథరూర్ కో ఆ పదవిని ఇవ్వచ్చు కదా, రచన, వచన నేర్పు ఉన్న శశిథరూర్ వరసగా ఎంపీగా కూడా గెలుస్తూ వస్తున్నారు. మరి అలాంటి వారికి ఈ పదవిని ఇవ్వొచ్చు. అయితే సొంతంగా గుర్తింపు తెచ్చేసుకుంటారనే నేతలకు కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ ఆ అవకాశాన్ని ఇవ్వదు. తమమాట జవదాటని వారేకావాలి. అందుకే  మల్లిఖార్జున ఖర్గేను ఆ పదవికి ఎంపిక చేస్తున్నారట. 

ఖర్గే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా కూడా గెలవలేకపోయారు. అలా అంటే రాహుల్ కూడా ఓడిపోయాడనుకోండి. తమమాట జవదాటరు కాబట్టి ఖర్గేకు ఈ పదవిని కేటాయిస్తున్నట్టుగా ఉన్నారు. ఇదివరకూ గత టర్మ్ లో లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేతగా కూడా ఖర్గేనే కూర్చోబెట్టారు. ఇప్పుడు జాతీయాధ్యక్ష పదవి విషయంలో కూడా కాంగ్రెస్ ఫస్ట్  ఫ్యామిలీకి వేరే ఛాయిస్ దొరికినట్టుగా లేదు!

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?