‘ఫాస్ట్’గా వచ్చి ‘ఫ్యూరియస్’గా పైరసీ అయింది

సినిమా అనేది విడుదలైన తర్వాత పైరసీ అవ్వడం కామన్ గా జరిగే వ్యవహారం. విడుదలకు ముందే ఎడిట్ రూమ్ నుంచి పైరసీ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ రెగ్యులర్ గా పైరసీ అనేది…

సినిమా అనేది విడుదలైన తర్వాత పైరసీ అవ్వడం కామన్ గా జరిగే వ్యవహారం. విడుదలకు ముందే ఎడిట్ రూమ్ నుంచి పైరసీ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ రెగ్యులర్ గా పైరసీ అనేది మాత్రం మొదటి ఆట తర్వాతే మొదలవుతుంది. కానీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా విషయంలో మాత్రం నిజంగానే చాలా ఫాస్ట్ గా ఉంది పైరసీ.

ఇండియాలో హాబ్స్ అండ్ షా (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రీలోడ్ వెర్షన్) సినిమా ఈరోజు విడుదలవుతోంది. కానీ దీని పైరసీ ప్రింట్లు మాత్రం నిన్నట్నుంచే ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేశాయి. ఈ సిరీస్ కు వరల్డ్ వైడ్ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న పైరసీదారులు, దొంగమార్గాల్లో ఈ సినిమా ప్రింట్ ను చేజిక్కించుకున్నారు. పైగా ఇది ఇంగ్లిష్ వెర్షన్ ఒరిజినల్ ప్రింట్.

దాదాపు 20 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కింది హాబ్స్ అండ్ షా మూవీ. ఈ మూవీ ఇలా విడుదలకు ముందే పైరసీ అవ్వడం అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ సినిమాకు సంబంధించి కేవలం డాల్బీ వెర్షన్ ను మాత్రమే ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజే విడుదలకాబోతోంది. ఒకరోజు ముందుగా ఎక్కడా రిలీజ్ చేయడం. పైరసీకి ఆస్కారం ఎక్కువగా ఉండే చైనా లాంటి దేశాల్లో అస్సలు రిలీజ్ చేయడంలేదు. అయినప్పటికీ ఇది పైరసీకి గురైంది.

ఈ సిరీస్ పై ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఈ వీకెండ్ మల్టీప్లెక్సుల్లో లోకల్ మూవీస్ కంటే ఈ సినిమానే చూసేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ లో ఈ మూవీదే డామినేషన్. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా పైరసీ ప్రింట్ సోషల్ మీడియాలోకి రావడంతో అది ప్రపంచవ్యాప్తంగా వసూళ్లపై పెనుప్రభావం చూపే ప్రమాదం ఉంది.

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?