పుష్ప..చంద్రబోస్..మరోసారి ఫిలాసఫీ

రంగ రంగ రంగస్థలాన అంటూ రంగస్థలం సినిమాలో ఫిలాసఫీని రంగరించి పాట అందించారు కవి చంద్రబోస్. మళ్లీ ఆయన, సుకుమార్ కలిసి పుష్ప సినిమా కోసం అదే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.  Advertisement చినచేపను…

రంగ రంగ రంగస్థలాన అంటూ రంగస్థలం సినిమాలో ఫిలాసఫీని రంగరించి పాట అందించారు కవి చంద్రబోస్. మళ్లీ ఆయన, సుకుమార్ కలిసి పుష్ప సినిమా కోసం అదే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. 

చినచేపను పెద చేప..పెద చేపను పెను చేప అన్నట్లుగా, ఈ భూ ప్రపంచం మీద ఒకదాని ఆకలి తీరాలంటే మరో జీవికి మూడి నట్లే అన్న ఫిలాసఫీని చెప్పడంతో పాట, ఈ బతుకు పోరాటంలో ప్రతి దానికీ ఓ ఎర అవసరం అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పేసారు.

అది ఎంత వరకు వెళ్లింది అంటే..భగవంతుడికి ఇచ్చే నైవేద్యం అయినా బలి అయినా అది కూడా ఎరే అని అనేంత వరకు. చంద్రబోస్ ఆలోచనా విస్తృతిని మెచ్చుకోవాల్సిందే. సరే, పాట విషయానికి వస్తే గ్రాఫిక్స్, విజువల్స్ కలిపి విడియో సాంగ్ గా మార్చి వదిలారు. 

బన్నీ సిగ్నేచర్ మూవ్ మెంట్ బాగుంది. ఆ మధ్య తమిళ సూపర్ స్టార్ విజయ్ మాస్టర్ సినిమాలో సిగ్నేచర్ స్టెప్ ను గుర్తు చేసింది. దేవీశ్రీప్రసాద్ సౌండింగ్ బాగుంది. ట్యూన్ మాత్రం అంత క్యాచీ కాదు. బాగా వినపడాల్సి వుంటుంది. 

విశేషం ఏమిటంటే మాస్టర్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ అంటూ సుకుమార్ కు, సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ అంటూ దేవీకి కొత్త బిరుదులు ఇచ్చేసారు. బన్నీకి ఐకాన్ స్టార్ వుండనే వుంది.