ఇక్క‌డ లొంగినోళ్ల‌కే అవ‌కాశాలుః వివాదాస్ప‌ద న‌టి

న‌టి, మోడ‌ల్‌, బిగ్‌బాస్ ఫేం మీరా మిథున్ ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు. మ‌రి ఇది ఆమె కావాల‌ని చేస్తున్నారో లేక వాటంత‌ట‌వే వివాదం అవుతున్నాయో తెలియ‌ని ప‌రిస్థితి. కానీ త‌న…

న‌టి, మోడ‌ల్‌, బిగ్‌బాస్ ఫేం మీరా మిథున్ ఇటీవ‌ల కాలంలో వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు. మ‌రి ఇది ఆమె కావాల‌ని చేస్తున్నారో లేక వాటంత‌ట‌వే వివాదం అవుతున్నాయో తెలియ‌ని ప‌రిస్థితి. కానీ త‌న వ్యాఖ్య‌ల‌కు వ‌క్ర‌భాష్యం చెప్ప‌డం వ‌ల్లే వివాదాలు చెల‌రేగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుదల చేసిన ఓ వీడియో మ‌రోసారి వివాదానికి దారి తీసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. 

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో మ‌గ‌వాడి ఆశ‌ల‌కు లొంగితేనే … అవ‌కాశాలు వ‌స్తాయ‌ని మీరా మిథున్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇత‌ర రాష్ట్రాల వారు ఇక్క‌డ విజ‌యాలు సాధిస్తున్నార‌ని ఆమె న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.

తమిళనాడు బిడ్డగా, ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళ నైన తాను అనేక ఇబ్బందుల్ని ఇక్కడ ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏది చేసినా, ఏమి చెప్పినా వివాదం చేస్తున్నారని ఆ వీడియోలో వాపోయారు. తనను వేధించిన ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడితే, దానిని ఎస్సీల‌ను కించ పరిచినట్లుగా చిత్రీకరించారని వివరించారు. 

తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల్ని అడ్డుకోవాలని, ఇందుకు ముగింపు పలికేందుకు సహకారం అందించాలని ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఎంకే స్టాలిన్‌లకు విజ్ఞప్తి చేయ‌డం గ‌మ‌నార్హం.