ఎస్ఆర్ కళ్యాణమండపం చిన్న సినిమాగా వచ్చి, భలే స్పెషల్స్ ట్యాగ్ లైన్ గా మార్చుకుంది. కరోనా రెండో దశ అనంతరం బయ్యర్లు డబ్బులు పెట్టి కొన్న తొలి సినిమా ఇదే. అలాగే జనాలు కాస్త విరగబడి చూసిన సినిమా కూడా ఇదే. చిన్న సినిమాల్లో మంచి వసూళ్లు కళ్ల చూసిన సినిమా కూడా ఇదే.
నైజాం లాంటి ఏరియాలో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. నైజాం తరువాత పెద్దదైన విశాఖలో ఫస్ట్ వీక్ తో బ్రేక్ ఈవెన్ అయింది. ఓవర్ సీస్ లో కూడా ఆమాత్రం కలెక్షన్లు కళ్ల చూసిన సినిమా ఇదే కావడం విశేషం. దాదాపు 73 లక్షల రూపాయలు గ్రాస్ తెచ్చుకుంది అక్కడ.
ఓ చిన్న సినిమాను కరోనా రెండో దశ తరువాత నైజాం, వైజాగ్, కర్ణాటక కలిపి రెండు కోట్ల పది లక్షలకు కొనడం అంటే కాస్త ఆశ్చర్యం, రిస్క్ తో కూడిన పనే.
కానీ పాటలు, బజ్ ను నమ్ముకుని కొన్న బయ్యర్ ఇఫ్పుడు ఫుల్ హ్యాపీ గా వున్నాడు. మొత్తం మీద సినిమా డబ్బులు వ్యవహారాలు అన్నీ పక్కన పెడితే, అదే హీరోకు ఒక్కసారిగా నాలుగు సినిమాలు చేతిలోకి రావడం విశేషం.