తెలంగాణా సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత అసలు తగ్గడం లేదు. జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కానీ, నాయకులు కానీ తన వెంట రాకపోయినా బీజేపీకి అధికారం దూరం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాట్లు మూర్మురం చేస్తున్నారు.
జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇవాళ యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. అందులో భాగంగా కేసీఆర్ తనకు కలిసివచ్చే సెంటిమెంట్లను పాటించబోతున్నారు. జాతీయ పార్టీ ప్రకటన ముందునే కేసీఆర్ కు సెంటిమెంట్ అయినా సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లనున్నారు.
కేసీఆర్ ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ వేసే ముందు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసీ ఎన్నికల రంగంలోకి దిగుతారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందు కూడా కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసారు. తెరాస పార్టీ ముఖ్య నేతలతో కలిసి జాతీయ పార్టీ ప్రకటనకు ముందు ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జాతీయ పార్టీ ప్రకటనకు దసరా రోజున కేసీఆర్ ముహుర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. జాతీయ పార్టీకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసినా కేసీఆర్, కొత్త పార్టీ పేరును దాదాపుగా నిర్ణయించారని తెలుస్తోంది. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న భారతీయ రాష్ట్ర సమితి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. దసరా రోజున పార్టీ పేరుతో పాటు దేశ వ్యాప్తంగా కో ఆర్డీనేటర్లను ప్రకటించాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జాతీయ స్థాయిలో వివిధ రంగలకు చెందిన ప్రముఖులను, రైతు సంఘాల నాయకులతో పాటు, వివిధ రాజకీయ పార్టీ నేతలను కలిసిన కేసిఆర్ రైతుల సమస్యలే తన పార్టీ ప్రధాన అజెండాగా ఉండబోతునట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీహార్ సీఎం కేసిఆర్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కూటమి తో జత కట్టిన తరువాత కేసిఆర్ దాదాపు జాతీయ స్థాయిలో ఒక్కడే బీజేపీ, కాంగ్రెస్ కూటమిలతో పోరాడబోతున్నారు.