సీనియర్ హీరో కృష్ణం రాజు స్మృతివనం ఏర్పాటు కేవలం రాజకీయం అని, రాజుల ఓట్ల కోసం అని తెలుగుదేశం సామాజిక బంధాల మీడియా అప్పుడో గోల మొదలెట్టేసింది.
ఇదే మీడియా గతంలో ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటు చేసినపుడు కళ్లు మూసుకుందేమో? అప్పుడు అలా చేయడం వారికి ‘కమ్మ’గా వుండి వుండొచ్చు. వైకాపా ఇప్పుడు ఇలా చేయడం మాత్రం రాజుల ఓట్ల కోసం అంటూ అప్పుడే వార్తలు వండి వారుస్తోంది
కృష్ణం రాజు సీనియర్ నటుడు. ఆంధ్రకు చెందిన వాడు. అతగాడికి ఆంధ్రలో స్మృతివనం కడితే తప్పేంటీ? హైదరాబాద్ నడిబోడ్డులో ఎన్టీఆర్ స్మృతివనం కట్టినపుడు లేని, రాని అభ్యంతరం కృష్ణం రాజు విషయంలో ఎందుకు?
కృష్ణంరాజు మరణించినపుడు చంద్రబాబు ఎందుకు పరామర్శకు వెళ్లారు. అది కేవలం రాజుల ఓట్ల కోసం అని ఎవరైనా అంటే ఏమని సమాధానం చెబుతారు. అలాగే రామకృష్ణం రాజును తెలుగుదేశం వెనకేసుకువస్తోంది. అది కేవలం రాజుల ఓట్ల కోసమా?
ప్రతిపక్ష నాయకులో, కిట్టని వారో ఇలాంటి మాటలు మాట్లాడితే మాట్లాడవచ్చు. ఓ మీడియాగా వుంటూ ఆదిలోనే ఇలాంటి వార్తలు ఎలా వండి వారుస్తారు? అంటే రాజుల సింపతీ ఎక్కడ వెళ్లిపోతుందో అని భయపడి ముందుగానే మోకాలు అడ్డం పెట్టడం అన్నమాట ఇదంతా.
చంద్రబాబు బాధ కన్నా, ఈ సామాజిక మీడియా బాధ ఎక్కువగా వుంటోంది.