బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తమ్ముడికి కామంలో కళ్లు మూసుకుపోయాయి. వరుసకు కూతురయ్యే యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఢిల్లీలోని జమీనా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘ రెండేళ్ల వయసులో మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న( నవాజుద్దీన్ తమ్ముడు)నన్ను లైంగికంగా హింసించాడు. నేను నరకాన్ని అనుభవించారు. ఆ వయసులో లైంగిక వేధింపులనే విషయం అర్థం కాలేదు. పెరిగి పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను. ఒక రోజు పెదనాన్న(నవాజుద్దీన్) నన్ను ‘నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?’ అని అడిగారు. అప్పుడు నేను, నాపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాను. ఆయన మాత్రం అలా ఏం జరిగి ఉండదన్నారు. ‘అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు’ అన్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత యువతి తాజా ఆరోపణలు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. వరుసకు తండ్రి వరుసయ్యే వ్యక్తిపై బాధితురాలి ఫిర్యాదు అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవాజుద్దీన్‌తో పాటు అతని తమ్ముడి వ్యవహార శైలిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీఛీ…కూతురు వరుసయ్యే అమ్మాయిపై లైంగిక వేధింపులా అని అసహ్యించుకుంటూ కామెంట్స్ పెడుతుండటం గమనార్హం.