మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం బ్రేక‌ప్ అంటోన్న బ్యూటీ

క‌న్నుగీటుతో రాత్రికే రాత్రే ఆమె సోష‌ల్ మీడియా స్టార్ అయ్యారు. ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమె ఏం షేర్ చేసినా నిమిషాల్లో వైర‌ల్ అవుతుంది. అలాంటి బ్యూటీ ఒక్క‌సారిగా సోష‌ల్…

క‌న్నుగీటుతో రాత్రికే రాత్రే ఆమె సోష‌ల్ మీడియా స్టార్ అయ్యారు. ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమె ఏం షేర్ చేసినా నిమిషాల్లో వైర‌ల్ అవుతుంది. అలాంటి బ్యూటీ ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా నుంచి క‌నుమ‌రుగైంది. దీంతో ఆమె అభిమానులు ఆవేద‌న చెందారు. మ‌ళ్లీ సోష‌ల్ మీడియా వేదిక‌పైకి రావాల‌ని అభ్య‌ర్థిస్తూ అభిమానులు పోస్టులు పెట్ట‌సాగారు.

ఎట్ట‌కేల‌కు అభిమానుల ప్రార్థ‌న‌ల‌ను మ‌న్నించిన ఆ అంద‌గ‌త్తె ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా సోష‌ల్ మీడియాలో ఎంట‌ర్ అయ్యారు. సోష‌ల్ మీడియా క్వీన్‌గా పేరొందిన ఆ అందాల తారే మ‌ల‌యాళ భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. లాక్‌డౌన్ వేళ‌లో సినీ సెల‌బ్రిటీలంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల్ని అల‌రిస్తుంటే…ఈమె మాత్రం అందుకు విరుద్ధంగా వాటికి దూరంగా ఉండ‌టం కాస్త నిరాశ ప‌రిచింద‌నే చెప్పొచ్చు.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాతో బ్రేక‌ప్ కావ‌డానికి కార‌ణాల‌ను తాజాగా ఆమె ఓ ప్ర‌త్యేక వీడియో ద్వారా వెల్ల‌డించారు. “హ‌లో హాయ్‌. రెండు వారాల విరామం త‌ర్వాత మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చాను. సోష‌ల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోడానికి ప్ర‌త్యేక కార‌ణాలంటూ ఏవీ లేవు. కేవ‌లం బ్రేక్ తీసుకోవాల‌ని అనుకుని తీసుకున్నానంతే. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం బ్రేక్ తీసుకున్నా. రెండు వారాలు ఎంతో స‌ర‌దాగా, ప్ర‌శాంతంగా జీవించాను. ఇది పూర్తిగా నా ప‌ర్స‌న‌ల్‌. ఇన్‌స్టా నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత చాలా మంది ట్రోల్ చేశారు. వాటిలో ఒక‌టి న‌న్ను చాలా బాధ పెట్టింది. ప్ర‌చారం కోసం నేను ఇన్‌స్టా నుంచి త‌ప్పుకున్నాన‌నేది ఆ ట్రోల్ సారాంశం. క‌రోనా విప‌త్తులో ఎవ‌రైనా ప‌బ్లిసిటీ కోసం అలా చేస్తారా? అలా ట్రోల్ చేసేవాళ్ల‌కు బుద్ధి లేదా అనిపించింది” అంటూ ఆమె విరుచుకుప‌డ్డారు.

ఏది ఏమైనా రావ‌డం రావ‌డంలోనే  ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌త్తిలాంటి మాట‌ల‌తో సోష‌ల్ మీడియాలో అడుగు పెట్టారు. సోష‌ల్ మీడియాతో బ్రేక్ (బ్రేక‌ప్‌) తీసుకుని తిరిగి నూత‌నోత్సాహంతో క‌నిపిస్తున్నారామె. మున్ముందు మునుప‌టిలాగే త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రించేందుకు ఆమె స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. 

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం