Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరంజీవిపై పరోక్షంగా సెటైర్లు వేసిన తేజ

చిరంజీవిపై పరోక్షంగా సెటైర్లు వేసిన తేజ

దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇది బహిరంగ రహస్యం. ఇందులో మరో చర్చకు తావులేదు. అయితే అలా పెద్ద దిక్కుగా మారాలంటే అందరి ఆమోదం ఉండాలంటున్నాడు దర్శకుడు తేజ. ఇండస్ట్రీ మొత్తం అంగీకరిస్తేనే పెద్దరికం వస్తుందంటూ చిరంజీవిపై పరోక్షంగా కామెంట్స్ చేశాడు.

"ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉండాల్సిందే. కానీ దాసరి గారిలా చేసే వాళ్లు ఉన్నారా లేదో చూడాలి. దాసరి నారాయణరావు దగ్గరకు లైట్ బాయ్ కూడా వెళ్లి ఇంటి తలుపు కొట్టగలడు. అవసరమైతే దాసరి గారు సీఎం, పీఎంతో కూడా మాట్లాడగలరు. అలాంటివాళ్లు అలా పుట్టాలంతే. మధ్యలో అలా తయారవ్వడం కుదరని పని. దాసరి గారి స్థానంలోకి ఫలానా వ్యక్తి వస్తే బాగుంటుందని నేను ఒక్కడ్ని అనుకుంటే కుదరదు. ఇండస్ట్రీ మొత్తం అంగీకరించాలి."

"ఇండస్ట్రీ గురించి ఏదైనా మీటింగ్ పెట్టుకొని, పరిశ్రమ తరఫు నుంచి జరిగితే మాత్రం పెద్దోళ్లను పిలవాల్సిందే. చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని ఇలా అందర్నీ పిలవాలి. ఇక్కడ ఇగోలు అవసరం లేదు. కంపల్సరీ పిలవాల్సిందే. ఆ మీటింగ్ ఇండస్ట్రీ పని మీద జరిగిందా లేక పర్సనల్ పనుల మీద జరిగిందో నాకు తెలీదు. ఇండస్ట్రీ గురించి జరిగితే మాత్రం బాలయ్యను పిలవాల్సిందే. ఈ విషయంలో ఎవ్వర్నీ హర్ట్ చేయకూడదు. ఆ మీటింగ్ కు అందరూ కలిసికట్టుగా వెళ్లాల్సింది. కలిసి నిర్ణయం తీసుకోవాల్సింది. సెపరేట్ సెపరేట్ గా ఎందుకు చేశారో నాకు తెలీదు."

తెలంగాణ ప్రభుత్వంతో పరిశ్రమ "పెద్దలు" కొంతమంది జరిపిన చర్చలపై కూడా తేజ సెటైర్లు వేశాడు. ఆ మీటింగ్ కు తనను పిలవలేదని.. ఎందుకంటే తను సూపర్ హిట్ డైరక్టర్ ను కాదని అన్నాడు. అదే సమావేశానికి కొరటాల, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి దర్శకులు వెళ్లారు. వాళ్లను ఉద్దేశించి తేజ ఇలా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశాడు.  

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?