నెల్లూరు జిల్లా ఆత్మకూరు బరిలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి దిగారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. నామినేషన్ల పర్వం మొదలైంది.
ఈ నెల 23న ఆత్మకూరు ఉప ఎన్నిక, 26న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మేకపాటి గౌతమ్‌రెడ్డి తమ్ముడు విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో పాటు ఆయన చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైసీపీ కుటుంబ సభ్యులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమేహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విక్రమ్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా అభివర్ణించారు. విక్రమ్‌రెడ్డిపై పోటీ చేసేందుకు ప్రత్యర్థులు భయపడుతున్నారని చెప్పారు.
లక్ష ఓట్లకు పైగా మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గౌతమ్‌రెడ్డికి నిజమైన నివాళి అన్నారు. ఆత్మకూరులో గెలుపే టార్గెట్‌గా ప్రతి ఒక్కరూ పని చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికతో పాటు 2024లో కూడా వైసీపీదే గెలుపన్నారు.