ఆర్ఆర్ఆర్…కేజిఎఫ్ లతో ఓటిటిలు తెలుగు వరకు చూసుకుంటే రెంట్ పేమెంట్ సిస్టమ్ తో కొత్త దారి తొక్కాయి. ఆల్రెడీ సబ్ స్క్రిప్షన్ పే చేసినా, సినిమా వరకు రెంట్ అంటూ కొంత మొత్తం సినిమా సినిమాకు వసూలు అనే దాన్ని స్టార్ట్ చేసాయి. పద్దతి పాతదే..తెలుగు వరకే కొత్త. అయితే జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది. సద్దు మణిగింది.
ఇప్పుడు మళ్లీ సర్కారు వారి పాట తో తెరపైకి వచ్చింది. సర్కారు వారి పాటకు కూడా ఓటిటి లో పెయిట్ సిస్టమ్ వచ్చింది. కానీ అది కాదు సమస్య. సినిమా ఇంకా థియేటర్లలో వుంది. ఇంతో అంతో కలెక్షన్ వస్తోంది. ఇప్పుడు 200 పెడితే ఇంట్లోనే ఇంటిల్లి పాదీ చూసుకోవచ్చు అంటే జనం ఇంక థియేటర్ వైపు ఎందుకు చూస్తారు అన్నది ఒక పాయింట్.
సినిమా విడుదలైన రెండు మూడు వారాల్లో ఇలా పెయిడ్ సిస్టమ్ మీద ఆన్ లైన్ లో కంటెంట్ అవైలబుల్ గా వుంటుంది అనే భావన బలపడితే ఇక పెద్ద సినిమాల కలెక్షన్ల మీద కచ్చితంగా ప్రభావం వుంటుందిని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే ముఫై రోజుల్లోనో, యాభై రోజుల్లోనో ఓటిటి లో వస్తుందనే భావనతో కనీసం పదిశాతం జనాలు అయితే థియేటర్ కు దూరం అయ్యారు. ఇప్పుడు ఈ కొత్త పద్దతి అలవాటు అయితే మరో పదిశాతం మది దూరం కావచ్చు అని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రేట్లు తగ్గించాం చూడండి మహా ప్రభో అంటూ నిర్మాతలు జనాలకు చెవిన ఇల్లు కట్టుకుని చెప్పాల్సి వస్తోంది. ఇక ఇలాంటి కొత్త కొత్త గా ఈ విధంగా సినిమా ఇంటికెే వస్తుందనే స్కీములు అలవాటు చేస్తే, భవిష్యతలో సినిమా ఇంటికే అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.