ఇతడు కక్కుర్తిపడ్డాడు.. ఆమె కొల్లగొట్టేసింది

మన బలహీనతే మోసం చేసేవాడికి పెట్టుబడి. చిట్టీ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాల్లో మోసాలకు ప్రధాన కారణం ఇదే. ఆన్ లైన్ మోసాలకు కూడా ప్రధాన కారణం వ్యక్తుల బలహీనతే. ఏమాత్రం ఆశపడ్డామా జేబుకు చిల్లు…

మన బలహీనతే మోసం చేసేవాడికి పెట్టుబడి. చిట్టీ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాల్లో మోసాలకు ప్రధాన కారణం ఇదే. ఆన్ లైన్ మోసాలకు కూడా ప్రధాన కారణం వ్యక్తుల బలహీనతే. ఏమాత్రం ఆశపడ్డామా జేబుకు చిల్లు పడినట్టే. కొంచెం కక్కుర్తిపడితే చాలు, మొత్తం కొల్లగొట్టేసే బ్యాచ్ మన చుట్టూనే ఉంటుంది.

తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఓ ఘటన దీనికి అసలు సిసలైన ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. సెక్స్ ఛాట్ కు కక్కుర్తిపడిన ఓ టెకీ.. అచ్చంగా 24 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.

“ఎప్పుడైనా కాల్ చేయండి. నేను మీ బెస్ట్ ఫ్రెండ్. కాసేపు నాతో ఛాట్ చేసి రిలాక్స్ అవ్వండి” మనలో చాలామందికి ఈ తరహా మెసేజీలు వస్తుంటాయి. కొంతమంది ముందుగానే జాగ్రత్తపడి వాటిని డిలీట్ చేస్తారు. మరికొందరు మాత్రం కాల్ చేసి బుక్కయిపోతారు. విశాఖపట్నం శివార్లలోని వేపగుంటలో ఉంటున్న 26 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఈ రెండో టైపు.

పైన చెప్పుకున్న లాంటి మెసేజ్ ఒకటి అతడి మొబైల్ కు వచ్చింది. కాల్ చేశాడు. అట్నుంచి స్వీట్ వాయిస్. వెంటనే వీడియో కాల్ లోకి రమ్మంది, న్యూడ్ ఛాట్ చేద్దామంటూ ఊరించింది. మనోడు చెప్పినట్టే చేశాడు. అంతే, క్షణాల్లో అతడి న్యూడ్ వీడియోలు, స్క్రీన్ షాట్స్ సేవ్ చేసింది యువతి. వాటిని సదరు వ్యక్తికి పంపించి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది.

అలా వివిధ బ్యాంక్ అకౌంట్లకు అక్షరాలా 24 లక్షల రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకుంది. డబ్బులు పోగొట్టున్న కుర్రాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ఈ పని చేసింది హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. షేక్ అబ్దుల్ రహీమ్, గుండా జ్యోతి, గుండా వీరసతీష్ ఇలా ఆన్ లైన్ లో మోసం చేసినట్టు గుర్తించారు. వాళ్ల నుంచి మూడున్నర లక్షల నగదు, ల్యాప్ టాప్, 5 స్మార్ట్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు.