‘నాంది’ సినిమాతో హిట్ కొట్టి, విలక్షణ నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న అల్లరి నరేశ్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఇటీవలే తిమ్మరసు లాంటి మాంచి సినిమాను అందించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ సినిమాకు `సభకు నమస్కారం` అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
సతీశ్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. ఈ చిత్రం గురువారం నాడు లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా, పోకూరి బాబూరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
`నాంది` డైరెక్టర్ విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్ స్క్రిప్ట్‌ను చిత్ర దర్శకుడు సతీశ్ మల్లంపాటికి అందించారు.
నరేశ్ 58వ చిత్రమిది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇలాంటి జోనర్‌లో నరేశ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా, తమ్మిరాజు ఎడిటర్, అబ్బూరి రవి డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు.