3 న మంచి రోజులు 10న లవ్ స్టోరీ

మళ్లీ థియేటర్లు కళకళ లాడబోతున్నాయి. వరుసగా విడుదల డేట్ లు లాక్ అవుతున్నాయి. ఇప్పటికే గత మూడు వారాలుగా ప్రతి వారం అయిదారు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిల్లో ఒకటయినా కాస్త నోటెడ్ మూవీ వుంటోంది.…

మళ్లీ థియేటర్లు కళకళ లాడబోతున్నాయి. వరుసగా విడుదల డేట్ లు లాక్ అవుతున్నాయి. ఇప్పటికే గత మూడు వారాలుగా ప్రతి వారం అయిదారు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిల్లో ఒకటయినా కాస్త నోటెడ్ మూవీ వుంటోంది. ఈ వారం విడుదల కాబోతున్నవాటిలో విష్వక్ సేన్ పాగల్ వుంది.

వచ్చే వారం (19న) మాత్రం మూడు నాలుగు చిన్న సినిమాలు వున్నాయి. శ్రీవిష్ణు 'రాజరాజ చోర' చెప్పుకోదగ్గ సినిమా. ఆ పైవారాన్ని సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ రిజర్వ్ చేసుకుంది. 

వాస్తవానికి ఈ డేట్ కు దర్శకుడు మారుతి సినిమా రావాల్సి వుంది. ఆయన కొత్త సినిమా 'మంచి రోజులు వచ్చాయి' సెప్టెంబర్ 3న విడుదలవుతుంది.

ఆపై వారం వినాయకచవితి కి నాగ్ చైతన్య-సాయిపల్లవి ల 'లవ్ స్టోరీ' విడుదలకు సిద్దం అవుతోంది. నాగశౌర్య లక్ష్య సినిమాను కూడా ఇదే నెలలో ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద సినిమాల కళ మొదలైంది.