ఇంట్లో కొహ్లీ అలా ఉండడు: అనుష్క

తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మైదానంలో చాలా ఉద్రేకంగా కనిపించినా, మైదానం ఆవల మాత్రం అలా ఉండడు.. అని అంటోంది అనుష్కా శర్మ. స్వతహాగా సెలబ్రిటీగా, ఆపై విరాట్ కొహ్లీ భార్యగా…

తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మైదానంలో చాలా ఉద్రేకంగా కనిపించినా, మైదానం ఆవల మాత్రం అలా ఉండడు.. అని అంటోంది అనుష్కా శర్మ. స్వతహాగా సెలబ్రిటీగా, ఆపై విరాట్ కొహ్లీ భార్యగా యమ క్రేజ్ ను కలిగి ఉన్న ఆనుష్క తన భర్త గురించి ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పింది. ప్రత్యేకించి అతడి వ్యవహరణ తీరు గురించి అనుష్క వివరించింది.

విరాట్ కొహ్లీ అంటేనే 'అగ్రెసివ్' అనే ముద్ర పడిపోయింది. మైదానంలో విరాట్ తీరు గురించి చర్చ ఈనాటిది కాదు. ఒక దశలో ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైపు చూస్తూ అసభ్య సంజ్ఞలు చేసి విరాట్ కోహ్లీ బుక్ అయ్యాడు. ఆ తర్వాత అతడి తీరులో కొంత మార్పు వచ్చింది. అయితే దూకుడు మాత్రం తగ్గలేదు. ప్రత్యర్థులను స్లెడ్జ్ చేయడం వంటివి ఉండవు కానీ, వివిధ సందర్భాల్లో ఆవేశపడిపోతూ ఉంటాడు.

ఇక గెలిచినప్పుడే కాదు, కనీసం ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన వికెట్ పడినప్పుడు కూడా కొహ్లీ స్పందన కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ స్పందన సరైనదే అని కొందరు అంటారు. ఆటపై అతడి మక్కువ ఆ స్థాయిలో ఉందని, దాన్ని తాము ఎంజాయ్ చేస్తామని కొందరు మాజీలు కూడా చెప్పారు. అయితే కొందరు ఈ విషయంలో విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇలాంటి నేఫథ్యంలో ఇంట్లో తన భర్త ఎలా ఉంటాడో అనుష్క చెప్పింది. అతడు చాలా కూల్ అని, మైదానంలో మీరు చూసే కొహ్లీకి, ఇంట్లో తనుచూసే విరాట్ కు ఏమాత్రం సంబంధం ఉండదంటూ అనుష్క చెప్పింది. ఇదే విషయాన్ని తను విరాట్ తో అంటూ ఉంటానంటూ కూడా తన భర్త తీరు గురించి వివరించింది.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది