జెర్సీ హీరోగా షాహిద్ ఫిక్స్

అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్ తో సెన్సేషన్ నమోదు చేసిన హీరో షాహిద్ కపూర్ మళ్లీ మరో మాంచి తెలుగు కథను చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ఈ మేరకు టెంటటివ్ గా ఓకె…

అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్ తో సెన్సేషన్ నమోదు చేసిన హీరో షాహిద్ కపూర్ మళ్లీ మరో మాంచి తెలుగు కథను చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ఈ మేరకు టెంటటివ్ గా ఓకె చెప్పాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తెలుగులో నాని హీరోగా నిర్మించిన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. తెలుగులో నిర్మించిన నిర్మాత నాగవంశీతో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి నిర్మిస్తారు.

అయితే హిందీలో మరెవరయినా ఈ ముగ్గురికి జాయిన్ అవుతారా? అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఫైనాన్షియల్ వ్యవహారాలు అన్నీ అలాగే వున్నాయి. అయితే సినిమాకు హీరోగా మాత్రం షాహిద్ కపూర్ ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు షాహిద్ నిర్మాతలకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి జెర్సీ సినిమాతో ముగ్గురు తెలుగు నిర్మాతలు ఓ హిందీ సినిమా తీయడం అన్నది మాత్రం ఫిక్స్ అయింది. అయితే దర్శకుడు ఎవరు? మిగిలిన వివరాలు అన్నీ తరువాత తెలుస్తాయి.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది