హీరోయిన్లు అంటే చాలామందికి చిన్నచూపు. వారికి ఏ విషయం మీదా అవగాహన ఉండదని, వారు సామాజిక విషయాల గురించి పట్టించుకోరనే అభిప్రాయాలే ఎక్కువగా ఉంటాయి. వారిని 'గ్లామర్ డాల్స్' గానే ట్రీట్ చేస్తారు అంతా. ఇక వారి విషయావగాహన గురించి ట్రోల్స్ కూడా సాగుతూ ఉంటాయి.
వారికి ప్రాథమిక అవగాహన కూడా ఉండదని చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తను ఆ టైప్ కాదన్నట్టుగా క్లారిటీ ఇస్తోంది కాజల్. తను ప్రతిరోజూ తప్పకుండా చేసే పని కాసేపైనా న్యూస్ చూడటం అని అంటోంది కాజల్. తను ఉరుకుల పరుగుల జీవితంలో, నిత్యం పనితో బిజీగా ఉన్నా.. ప్రతిరోజూ కొద్దిసేపు అయినా వార్తలను వీక్షించే ఆసక్తి ఉందని కాజల్ అంటోంది.
మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతోందో తెలుసుకునే ఆసక్తితో తను తప్పకుండా ప్రతిరోజూ వార్తలను ఫాలో అవుతానంటూ కాజల్ వివరించింది. ఇటీవలే ఎన్నికల విజేతలకు కూడా కంగ్రాట్స్ చెబుతూ కాజల్ ట్వీట్లేవో పెట్టినట్టుంది. మరి ఇప్పటికే పుష్కరకాలానికి పైనే హీరోయిన్ గా కొనసాగుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న కాజల్.. భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుందేమో!