ఆర్ఆర్ఆర్..క్రిస్మస్..రిపబ్లిక్ డే ?

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా విడుదల డేట్ ల మీద ఎప్పటికప్పుడు ఎక్స్ క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే వస్తున్నాం.  Advertisement అక్టోబర్ 13 కు కూడా ఆర్ఆర్ఆర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ…

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా విడుదల డేట్ ల మీద ఎప్పటికప్పుడు ఎక్స్ క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే వస్తున్నాం. 

అక్టోబర్ 13 కు కూడా ఆర్ఆర్ఆర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని గతంలోనే వెల్లడించాం. ఇప్పుడు కూడా అదే పక్కా అని తెలుస్తోంది. 

అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ విడుదల అన్నది లేదని దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. కొత్త తేదీగా క్రిస్మస్ ఇంకా రిపబ్లిక్ డే లను పరిశీలిస్తున్నట్లు బోగట్టా.

సంక్రాంతి సినిమాలను డిస్ట్రబ్ చేయము అని రాజమౌళి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో వున్న యూనిట్ ఇండియాకు వచ్చి ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన తరువాత పరిస్థితులు అన్నీ పరిశీలించి ఈ మేరకు కొత్త డేట్ ను ప్రకటించే అవకాశం వుంది.

అయితే జస్ట్ ప్రకటించి వదిలేయడం కాకుండా, టోటల్ పరిస్థితులు అన్నీ వివరించి డేట్ ను ప్రకటించే అవకాశం వుంది.