సైరాతో వెంకీ మామ ఢీ

మెగాస్టార్ మెగా మూవీ సైరా అక్టోబర్ 2న విడుదల అన్నది ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందని అనధికార వార్తల బోగట్టా. సైరా లాంటి పెద్ద సినిమా వస్తోంది అంటే సాధారణంగా పోటీ అన్నది వుండదు. కానీ…

మెగాస్టార్ మెగా మూవీ సైరా అక్టోబర్ 2న విడుదల అన్నది ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందని అనధికార వార్తల బోగట్టా. సైరా లాంటి పెద్ద సినిమా వస్తోంది అంటే సాధారణంగా పోటీ అన్నది వుండదు. కానీ సైరా విడుదల అవుతున్నది దసరా సీజన్ లో. అందుకే ఈ సీజన్ ను వదులుకోకూడదని, దసరా లాంటి పెద్ద సీజన్ కు రెండు సినిమాలు వున్నా ఫరవాలేదని డిసైడ్ అయిపోయింది వెంకీమామ సినిమా యూనిట్.

సైరా సినిమాకు రెండురోజులు అవతలగా అంటే అక్టోబర్ 4న వెంకీమామ సినిమా విడుదలకు ముహుర్తం పెట్టేసినట్లు బోగట్టా. తొలిసారిగా మామ-మేనల్లుడు వెంకీ-నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ కాంబినేషన్ ఓ బేబీ సినిమాతో మాంచి హిట్ కొట్టారు.

క్రేజీ హీరోయిన్లు రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమాకు రవీంద్ర(బాబి) దర్శకుడు. జైలవకుశ సినిమా తరువాత బాబీ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇదే. ధమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో వెంకీ మిలటరీ అధికారిగా కనిపిస్తాడని వార్తలు వున్నాయి. మొత్తంమీద ఈ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ వెంకీమామ, సీరియస్ పీరియాడికల్ సినిమా సైరాతో పోటీ పడబోతోంది.

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!