జనసేన మీటింగ్ లో జగన్ ప్రస్తావన!

జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత అందరూ బీజేపీతో జనసేనాని పొత్తు వ్యాఖ్యల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే మీటింగ్ లో మరో ముఖ్యమైన చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన ప్రముఖంగా…

జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్ తర్వాత అందరూ బీజేపీతో జనసేనాని పొత్తు వ్యాఖ్యల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే మీటింగ్ లో మరో ముఖ్యమైన చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన ప్రముఖంగా వచ్చినట్టు చెబుతున్నారు. అసెంబ్లీలో జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, సీఎం జగన్ ని పొగిడిన తీరుని కొంతమంది పరోక్షంగా తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావిస్తూనే మెల్లగా జగన్ స్తోత్రంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై సంజాయిషీ కూడా అడిగారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ జరగడం పార్టీకి డ్యామేజీగా సీనియర్లు భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీలో జగన్ పై జనసేన ఎమ్మెల్యే పొగడ్తల వర్షం ప్రస్తావనకు వచ్చింది. బడ్జెట్ సెషన్లో జనసేన ప్రయారిటీల గురించి వివరించి ఉండాల్సిందని, జనసేనాని భావజాలాన్ని మరింతగా అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అయితే రాపాక మాత్రం మౌనాన్నే ఆశ్రయించారని చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించాలంటే.. ప్రభుత్వాన్ని, వారి విధానాలను వీలైనంత వరకు విమర్శించాలని, సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ప్రజా పోరాటాలను మొదలు పెట్టాలని మీటింగ్ లో నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తమ్మీద జనసేన పార్టీ నిర్మాణం గురించి మాట్లాడుకోవడం కంటే.. జగన్ గురించి మాట్లాడటానికే ఎక్కువ సమయం కేటాయించారని తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ, పవన్ కల్యాణ్ ఇంకా తాను జగన్ కి గట్టిపోటీ అని భ్రమపడడం ఒక్కటే ఆశ్చర్యం కలిగిస్తోంది. మాటమీద నిలబడే వ్యక్తి జగన్ అయితే, తన నిర్ణయాలను మార్చుకునే రకం పవన్ కల్యాణ్. మరి ఈ తురుపుముక్క బీజేపీతో మిలాఖత్ అవ్వాలని చూస్తున్న ఈ తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి. 

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!