కామ్రేడ్ కి కోత లాభమా? నష్టమా?

అదేమన్నా గడ్డమా ట్రిమ్ చేస్తే అందంగా కనిపించడానికి, ట్రిమ్ చేయకపోతే అసహ్యంగా ఉండటానికి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిదో కొత్త ట్రెండ్ అయినట్టుంది. ముందు మూడు గంటల సినిమా విడుదల చేయడం, ఆ తర్వాత…

అదేమన్నా గడ్డమా ట్రిమ్ చేస్తే అందంగా కనిపించడానికి, ట్రిమ్ చేయకపోతే అసహ్యంగా ఉండటానికి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిదో కొత్త ట్రెండ్ అయినట్టుంది. ముందు మూడు గంటల సినిమా విడుదల చేయడం, ఆ తర్వాత ట్రిమ్ చేయడం. ఇప్పుడు బోర్ కొట్టదు, ఇంకోసారి థియేటర్లకెళ్లి ట్రై చేయండి అంటూ మెసేజ్ ఇవ్వడం. డియర్ కామ్రేడ్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

సినిమా లెంగ్త్ ఎక్కవ కావడంతో కొన్ని సన్నివేశాల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ప్రోమోలతో అందరిలో ఆసక్తి రేకెత్తించిన క్యాంటీన్ సాంగ్ ని యాడ్ చేశారు. క్యాంటీన్ సాంగ్ బాగుంటుందా, లేక సన్నివేశాలు బాగుంటాయా అనే జడ్జిమెంట్ లో హీరో సహా టెక్నికల్ టీమ్ ఫెయిలైనట్టు కనిపిస్తోంది. అందుకే సీన్ల కోసం త్యాగంచేసిన క్యాంటీన్ సాంగ్ ని, ఇప్పుడా సీన్లను కట్ చేసి మరీ యాడ్ చేస్తున్నారు.

అయితే సినిమాపై జనాల్లో ఓ అభిప్రాయం వచ్చిన తర్వాత ఇలాంటి జిమ్మిక్కులేవీ పనిచేయవనేది పచ్చినిజం. పెద్ద హీరోలకు సైతం ఇది అనుభవంలోని విషయమే. విజయ్ దేవరకొండ సినిమాకు ట్రిమ్మింగ్ మేలు చేస్తుందా లేక కీడుచేస్తుందా అనే విషయంపై కూడా నిర్మాతలకు ముందుగానే ఓ క్లారిటీ ఉంది. అయితే అప్పుడే సినిమాని వదిలేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో జాకీలుపెట్టి లేపడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు.

పూర్తిగా ఫ్లాపయితే వదిలేసేవాళ్లేమో కానీ.. వ్యవహారం కాస్త అటుఇటుగా ఉండటంతో విజయ్ కూడా అస్త్ర సన్యాసం చేయకుండా పోరాడుతున్నాడు. వుమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ తో ప్రోగ్రామ్ డిజైన్ చేయడంతో సహా.. ప్రమోషన్ కార్యక్రమాల జోరుపెంచాడు. కలెక్షన్లతో సేఫ్ జోన్ లో ఉన్న డియర్ కామ్రేడ్ ట్రిమ్మింగ్ తో అందంగా తయారై అందరి మనసులు దోచుకుంటుందా లేదా.. వేచిచూడాలి.

మరోవైపు సోమవారం ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పటివరకు 50శాతం రికవరీ అయిందని ప్రకటించిన మేకర్స్.. సోమవారం నాటి కలెక్షన్లతో అనుమానంలో పడ్డారు.

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!