హిందీలో ‘డియర్ కామ్రేడ్’ ఎవరు?

తెలుగులో మిక్డ్స్ టాక్ పొందిన 'డియర్ కామ్రేడ్' బాలీవుడ్ వెర్షన్ కథేంటి? అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఈ సినిమాను తను రీమేక్ చేయబోతున్నట్టుగా కరణ్ జొహార్ ప్రకటించారు. విడుదలకు ముందే ఆ ప్రకటన చేశాడు…

తెలుగులో మిక్డ్స్ టాక్ పొందిన 'డియర్ కామ్రేడ్' బాలీవుడ్ వెర్షన్ కథేంటి? అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఈ సినిమాను తను రీమేక్ చేయబోతున్నట్టుగా కరణ్ జొహార్ ప్రకటించారు. విడుదలకు ముందే ఆ ప్రకటన చేశాడు కరణ్. బహుశా విజయ్ దేవరకొండ తెలుగు హిట్ 'అర్జున్ రెడ్డి' బాలీవుడ్ రీమేక్ సాధించిన విజయాన్ని చూసి కరణ్ ఆ ప్రకటన చేసి ఉండొచ్చు.

అయితే 'డియర్ కామ్రేడ్'కు వస్తున్న టాక్ మాత్రం వేరేరకంగా ఉంది. మరి ఇప్పుడు కూడా ఈ సినిమాను కరణ్ రీమేక్ చేస్తాడా? అనేది చర్చనీయాంశం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఊహాగానాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఈ సినిమా హిందీ వెర్షన్లో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడని ఒక ప్రచారం సాగుతూ ఉంది. అయితే అందుకు అధికారిక ధ్రువీకరణ ఏమీలేదు.

మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్లో 'ధడక్' పెయిర్ ఇషాన్-జాన్వీలు నటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రచారానికి కరణ్ జొహార్ ఫుల్ స్టాప్ పెట్టాడు. మరి ఇంతకీ 'డియర్ కామ్రేడ్' రీమేక్ అవుతుందా? లేక సౌత్ లాంగ్వేజ్ లలో వచ్చిన రెస్పాన్స్ తో హిందీలోకి డబ్బింగ్ మాత్రమే ఉంటుందా? అనేవి ప్రస్తుతానికి ప్రశ్నలే!

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!