బట్టల పిచ్చి అంటుకున్నట్లేనా?

రౌడీ వేర్ అంటూ యంగ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ క్లోత్ బ్రాండ్ ను స్టార్ట్ చేసాడు. నిజానికి అది ఆయన స్వంతం కాదు. వేరెవరితోనో కలిసి అది ఆయన స్టార్ట్ చేసారు. ఆయన…

రౌడీ వేర్ అంటూ యంగ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ క్లోత్ బ్రాండ్ ను స్టార్ట్ చేసాడు. నిజానికి అది ఆయన స్వంతం కాదు. వేరెవరితోనో కలిసి అది ఆయన స్టార్ట్ చేసారు. ఆయన బిజినెస్ ఎలా సాగుతోంది. క్లిక్ అయిదా లేదా? అనేది పక్కన పెడితే, రౌడీ బ్రాండ్ డిజైన్లు కొన్ని కింది మార్కెట్ లో డూప్లికేట్లుగా మారిపోయాయి. సరే ఆ సంగతి అలావుంచితే, ఇస్మార్ట్ శంకర్ టైమ్ లో ఆ సినిమా నిర్మాతలు పూరి-చార్మి తమ సినిమా డిజైనర్ల ద్వారానే పూలచొక్కాలు కొన్ని తయారుచేయించి ఆన్ లైన్ లో అమ్మకాలు పెట్టారు. ఈ పూల చొక్కాలు కొత్త డిజైన్లు ఏవీకాదు. ఎన్టీఆర్ జమానాలో నడిచినవే.

సరే ఆ సంగతీ అలాపెడితే, సూపర్ స్టార్ మహేష్ బాబు హంబుల్ అంటూ క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసారు. అది మహేష్ బాబు స్వంతమా? లేదా బ్రాండింగ్ పార్టనర్ నా? బ్రాండ్ అంబాసిడర్ నా? అన్నది క్లారిటీ లేదు. అయితే రౌడీవేర్, ఇస్మార్ట్ వేర్ మాదిరిగా కాకుండా, కాస్త పద్దతిగా, ఎవరైనా వేసుకోవడానికి వీలుగా, బ్రాండ్ పేరు హంబుల్ అన్నందుకు, అందుకు తగినట్లుగా వున్నాయి ప్రకటనలు.

ఇదిలావుంటే మహేష్ బాబు ఇలా ప్రకటించిన కాస్సేపటికే STAAR అంటూ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఓ పోస్టర్ ను చలామణీలోకి తెచ్చారు. ఆగస్టులో తమ హీరో క్లోతింగ్ బ్రాండ్ రెడీ అవుతోంది అంటూ. వాస్తవానికి అల్లుఅర్జున్ స్టయిల్ క్లోతింగ్ మార్కెట్ లోకి వస్తుందని ఎప్పటి నుంచో గ్యాసిప్ వుంది. మరి ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్, ఆ స్టార్ బ్రాండ్ అన్నది నిజమా, గ్యాసిప్ నా అన్నది తెలియాల్సి వుంది. కానీ ఆగస్టు నుంచి బన్నీ బ్రాండ్ దుస్తులు వస్తాయని టాక్ మాత్రం బలంగా వుంది.

చూస్తుంటే సినిమా హీరోల క్రేజ్ ను వాడుకుని, తెరవెనుక దుస్తుల వ్యాపారులు ఎవరికి వారు బ్రాండిగ్ రెమ్యూనిరేషన్ తో రెడీ అవుతున్నారు అని అర్థం అవుతోంది. లేదూ అంటే ఈ వ్యాపారం అంత సులువుకాదు. ఒకవేళ అదే నిజమైతే, ఇక మిగిలిన హీరోల బ్రాండ్ లు కూడా రెడీ అయిపోతాయి. ఎందుకంటే పేరు వాడుకుని డబ్బులు ఇస్తామంటే ఎవరికి చేదు?

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!