మహేష్ ఔదార్యం? ఎవరికి కష్టం?

మహేష్ బాబు షూటింగ్ లో మినరల్ వాటర్ కాకుండా రెగ్యులర్ వాటర్ ఇవ్వడం మీద ఆయన కోప్పడిపోయారు అంటూ వార్తలు హల్ చల్ చేసాయి. భలే ఫన్నీగా వున్నాయి ఈ వార్తలన్నీ. సాధారణంగా ఎక్కడన్నా…

మహేష్ బాబు షూటింగ్ లో మినరల్ వాటర్ కాకుండా రెగ్యులర్ వాటర్ ఇవ్వడం మీద ఆయన కోప్పడిపోయారు అంటూ వార్తలు హల్ చల్ చేసాయి. భలే ఫన్నీగా వున్నాయి ఈ వార్తలన్నీ. సాధారణంగా ఎక్కడన్నా ఏం జరుగుతుంది? అసలు? అన్నది చూద్దాం. ఇవ్వాళ, రేపు ఇళ్లలో కానీ, బయట ఫంక్షన్లలో కానీ, ఎవరైనా ఆర్వో ఫిల్టర్ చేసిన పాతిక లీటర్ల క్యాన్ వాటర్లే వాడుతున్నారు. అయితే పెద్దవారు ఫంక్షన్ లకు, ఈవెంట్లకు వస్తే మాత్రం బాటిల్డ్ వాటర్ లు ఇవ్వడం కామన్.

సినిమా యూనిట్ లు, సినిమా ఆఫీసులు, అన్నింటా కూడా ఇదే ప్రాక్టీస్. సినిమా ఆఫీసుల్లో సైతం పాతిక లీటర్ల క్యాన్ లు రప్పించి, వాటిని వాటర్ బాటిళ్లలో పట్టి వుంచుతారు. అవే వాడతారు. మహేష్ బాబు సినిమా షూట్ లో కూడా అదే చేసారని తెలుస్తోంది. అయితే స్టార్ లకు మాత్రం మినరల్ వాటర్ బాటిళ్లు ఇస్తున్నారు. ఈ తేడా మీదే మహేష్ బుస్సుమన్నాడన్నది వార్తల సారాశం.

సినిమా రంగంలో స్థాయిబట్టి తేడా అన్నది కామన్. అందరు నటులకు ఒకేతరహా కేరవాన్ లు ఇవ్వరు కదా? కొందరికి సింగిల్, కొందరికి డబుల్ షేరింగ్, ఇంకొందరికి ట్రిపుల్ షేరింగ్ కేరవాన్ లు ఇస్తారు. ఇవన్నీ కామన్. షూటింగ్ మొత్తం జనాలకు బాటిల్డ్ వాటర్ అందివ్వాలంటే కేసులకు కేసులు కొనాలి. సుమారు వంద వర్కింగ్ డేస్ అనుకుంటే, ఎన్ని వందల కేసులు కొనాలి.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, నిర్మాతగా మహేష్ కేర్ తీసుకుంటున్నాడు అని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మహేష్ పేరుకే నిర్మాత. ఆయన నాన్ థియేటర్ రైట్స్ తన వాటాగా తీసుకుని, అంటే ముందే ఫిక్స్ డ్ లాభాలు తీసుకుని, తన బ్యానర్ యాడ్ చేసారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంటే ఖర్చుతో ఆయనకు సంబంధం లేదు.

దిల్ రాజు, అనిల్ సుంకర ఆ ఖర్చు భరించి, అమ్మకాల్లోంచి ఖర్చులు పోను లాభాలు చూసుకుంటారు. అంటే ఏం ఖర్చు పెరిగినా అది అనిల్ సుంకరకు, దిల్ రాజుకే తప్ప, మహేష్ బాబుకు కాదు. మరి అలాంటపుడు అందరికీ మినరల్ వాటర్ ఇవ్వమని మహేష్ బాబు చెప్పడం ఔదార్యం ఎలా అవుతుంది? అదే మహేష్ బాబు తన లాభాల్లో ఖర్చు రాసి తెప్పించండి అని చెబితే ఔదార్యం అవుతుంది కానీ? 

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!