సైరా మేకింగ్ వీడియో త్వరలో

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విడుదల మరో రెండు నెలల్లోకి వచ్చింది. అక్టోబర్ 2న విడుదల. భారీ సినిమా కనుక ఇప్పటి నుంచే పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. సాహో మాదిరిగా కాకుండా ఓ పద్దతిగా,…

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విడుదల మరో రెండు నెలల్లోకి వచ్చింది. అక్టోబర్ 2న విడుదల. భారీ సినిమా కనుక ఇప్పటి నుంచే పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. సాహో మాదిరిగా కాకుండా ఓ పద్దతిగా, ప్లాన్డ్ గా వెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి ఒకటి రెండు క్యారెక్టర్ లుక్ లు, మెగాస్టార్ క్యారెక్టర్ టీజర్ మాత్రమే బయటకు వచ్చాయి. గత రెండేళ్లుగా సినిమా ఏం తీసారు? ఏమిటి సంగతి అన్నది తెలియదు.

అందుకే త్వరలో ముందుగా ఓ మేకింగ్  వీడియోతో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రెండు నిమిషాలకు కాస్త తక్కువగా వుండే ఓ మేకింగ్ వీడియోను రూపొందించే కార్యక్రమం జరుగుతోందని బొగట్టా. సినిమా ఎంత గ్రాండియర్ గా వుండబోతొంది? టోటల్ సినిమా మేకింగ్ అంతా కలిపి ఓ చిన్న టీజర్ మాదిరిగా రూపొందిస్తున్నారు.

ఇది ఆగస్టులో విడుదల చేయడంతో ప్రచారం ప్రారంభమవుతుంది. అక్కడినుంచి అరవై రోజుల పాటు లుక్ లు, టీజర్, సాంగ్స్, ట్రయిలర్ ఇలా వరుసగా రాబోతున్నాయి. మెగాభిమానులకు ఇక పండగే.

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు