పూరీయిజం: నాది వెధవ పుట్టుక!

పూరి జగన్నాధ్ సినిమాల్లో మాస్ కనిపిస్తుంది. అతడి సినిమాల్లో ఓ రకమైన తాత్వికత ఉంటుంది. అవన్నీ సినిమాల్లోనే కాదు, తన జీవితంలో కూడా ఉన్నాయంటున్నాడు ఈ దర్శకుడు. తన జీవితానికి సంబంధించి ఎవ్వరికీ తెలియని…

పూరి జగన్నాధ్ సినిమాల్లో మాస్ కనిపిస్తుంది. అతడి సినిమాల్లో ఓ రకమైన తాత్వికత ఉంటుంది. అవన్నీ సినిమాల్లోనే కాదు, తన జీవితంలో కూడా ఉన్నాయంటున్నాడు ఈ దర్శకుడు. తన జీవితానికి సంబంధించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాల్ని బయటపెట్టాడు. ఇండస్ట్రీకి వచ్చి, డైరక్టర్ గా ఎదిగిన తర్వాత కూడా బతకడానికి డబ్బుల్లేని దశను చూశానంటున్నాడు పూరి.

“నా లైఫ్ లో చీకటి దశ ఒకటుంది. అన్ని పోగొట్టుకొని, మొత్తం అన్నీ అమ్మేశాను. ఇంట్లో కుక్కలు కూడా పెంచే కెపాసిటీ లేదు. ఓ చిన్న రెంట్ హౌజ్ లో ఉన్నాను. బుజ్జిగాడు సినిమా టైమ్ లో ఇది జరిగింది. రకరకాల మనుషుల మనస్తత్వాలు, అసలైన ఫ్రెండ్స్ ఎవరనేది అప్పుడు తెలిసింది. ఓ క్లారిటీ వచ్చింది. ఆసాంతం సంకనాకిపోవడం కూడా జీవితంలో ఓ మంచి అవకాశం. ఇలా జరగడం కూడా మంచిదే.”

ఇలా తన జీవితంలో చీకటి దశను బయటపెట్టాడు పూరి. పరిశ్రమకు వచ్చిన తర్వాతే తనకు సిగరెట్ అలవాటైందనే కామెంట్ ను తిప్పికొట్టాడు పూరి. తను చిన్నప్పట్నుంచే చుట్టలు కాల్చేవాడిననే బయటపెట్టాడు. తన ఇంట్లో ఎవరికీ సిగరెట్ అలవాటు లేదని, తనకు మాత్రం ఆ అలవాటు వచ్చిందని, ఇక దాన్ని మానుకోలేనని కూడా అంటున్నాడు.

“నేను బాగా ఇబ్బందిపడే అంశం సిగరెట్. ఎందుకు అలవాటైందో తెలీదు. వెధవ పుట్టుక పుట్టిన తర్వాత తప్పదు కదా. నా తమ్ముడు నాతోనే పెరిగాడు వాడు కాల్చడు. నా కొడుకు కాల్చడు. నా ఒక్కడికే అలవాటైంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు సిగరెట్ అలవాటు అవ్వలేదు. ముందునుంచే ఉంది. మా తాతమ్మ, నేను కలిసి చుట్ట తాగేవాళ్లం. ఆమెకు ఓ వందేళ్లు ఉంటాయి.”

సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ లో భాగంగా తన పెళ్లికి సంబంధించిన గమ్మత్తైన విషయాన్ని కూడా బయటపెట్టాడు పూరి. పెళ్లి చేసుకోవాల్సిన టైమ్ కు తన దగ్గర 500 రూపాయలు కూడా లేవని, యాంకర్ ఝాన్సీ, హేమ తన పెళ్లిని దగ్గరుండి చేశారని గుర్తుచేసుకున్నాడు.

“మా ఆవిడ్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా వర్క్ చేస్తున్నాను. సినిమా లాస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. అప్పటికే మా ఆవిడతో ప్రేమలో ఉన్నాను. అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎర్రగడ్డలో ఓ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నాను. నా దగ్గర ఆ టైమ్ లో డబ్బుల్లేవు. యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చింది. హేమ బట్టలు కొనింది. వేరొకరు ఎవరో కూల్ డ్రింక్స్ కొన్నారు. అక్కడే తాళి కట్టేసి, అందరికీ కూల్ డ్రింక్స్ పంచేసి మళ్లీ షూటింగ్ కు వెళ్లిపోయా.”

మరో పదేళ్లకు సరిపడ కథలు తన వద్ద ఉన్నాయంటున్నాడు పూరి. వాటితో సినిమాలు తీస్తే అవి హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా అనే విషయం తనకు తెలియదని.. కానీ ఆ కథలన్నింటినీ సినిమాలుగా తీయొచ్చని, అలా పదేళ్లు గడిపేయొచ్చని అంటున్నాడు.

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు